SAKSHITHA NEWS

Householders are the charioteers of the party – Government Whip Samineni Udayabhanu

గృహ సారధిలే పార్టీకి రథసారథులు – ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను
సాక్షిత : గృహ సారుదులే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకు రథసారధులని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు._

జగ్గయ్యపేట మండలం స్టీల్ ప్లాంట్ ఆడిటోరియం నందు జగ్గయ్యపేట మండలంలోని అన్నవరం,బూదవాడ,రెడ్డినాయక్ తండా,త్రిపురవరం,అగ్రహారం,ముక్తేశ్వరపురం,జయంతిపురం,రావిరాల గ్రామాలలోని సచివాలయ కన్వీనర్లు,గృహసారధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ సామినేని ఉదయభాను వారి తనయులు నియోజకవర్గ యువనాయకులు శ్రీ సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ బాబు ప్రత్యేక శిక్షణ సమావేశం నిర్వహించారు.*_

ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నియమించిన గృహసారధుల పనితీరు బట్టి భవిష్యత్తులో వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు,పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తు ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో ప్రజలకు చేరువ చేసేందుకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మరో వ్యవస్థనే గ్రామ,సచివాలయ కన్వీనర్లు,గృహ సారధులని అన్నారు.

గత చంద్రబాబు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు అవినీతికి వివక్షకు పరాకాష్టగా నిలిచాయని అన్నారు,బడుగు బలహీన వర్గాలను అగౌరవపరిచిన బాబు వారి సంక్షేమం గురించి ఆలోచించకుండా తన బినామీలకు పెద్దపీట వేశాడు అని అన్నారు,బాబు హయంలో 6000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చిన బాబు పేదలకు చదువును భారం చేశాడని అన్నారు.

నేడు మన జగనన్న ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు లేకుండా పారదర్శకంగా పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్నారని అన్నారు,బడుగు బలహీన వర్గాలకు మన జగనన్న ప్రభుత్వం పెద్దపీట వేసిందని,నాడు నేడు ద్వారా కోట్ల రూపాయలను వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి పేద పిల్లల చదువుకు భరోసాను కల్పిస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS