SAKSHITHA NEWS

దేశ రాజధాని ఢిల్లీ లోని వసంత్ విహార్ లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్ ను ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ కి, గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ శ్రేణులందరికి శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభుత్వ విప్ గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఈ రోజు చాలా శుభపరిణామం అని, దేశ రాజధానిలో బీఆర్ ఎస్ పార్టీ భవనం ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని,
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ,దేశంలో ఒక గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగినది అని,

ఆనాడు ఎలాగైతే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విప్లవాత్మక పంథాను అనుసరించారో..అలాగే ఈనాడు దేశహితం కోసం నూతన రాజకీయ ఒరవడిని కేసీఆర్ ప్రారంభిస్తున్నారు అని,తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ, ప్రగతి విధానాలు బీఆర్ఎస్ వేదికగా దేశం మొత్తానికి పరిచయం అవుతాయి, దేశంలో రాబోయే గుణాత్మక మార్పుకు ఈనాటి బీఆర్ ఎస్ కార్యాలయ ప్రారంభం నాంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.ఈ రోజు చాలా శుభ దినం అని, పండుగ వాతావరణం నెలకొంది అని, దేశ రాజకీయాల్లో కీలక మలుపు అని,తెలంగాణ భూమికగా, భారతావని వేదికగా సమగ్ర సమ్మిళిత, అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా మొదలైన కేసీఆర్ మరో ప్రస్థానం ఈ రోజు నుండి మొద‌లైంది అని, అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ భార‌త రాష్ట్ర స‌మితి నినాదం అని పేర్కొన్నారు.

అదేవిధంగా భారత రాజకీయ యవనికపై కొత్త ధ్రువతార వెలిసింది అని. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటైంది.

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మారింది. 21 ఏండ్ల అనుభవం, 60 లక్షల మంది సుశిక్షితులైన సైనికులు కలిసి భారతదేశ తలరాతను మార్చేందుకు నడుం బిగించారు అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ TRS పార్టీ ని BRS పార్టీ గా మారుస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తు, స్వాగతిస్తున్నాం అని , మా పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది అని ,ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడుస్తామని, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ ఏకైక లక్ష్యం సంక్షేమ భారతం అని , ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ ఒక గొప్ప విజన్ ఉన్న నేత అని ,దేశం గర్వించే విధంగా దేశ రాజకీయ వ్యవస్థను మార్చే శేక్తి ఒక ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కే ఉంది అని, దేశం ప్రస్తుతం గుణాత్మకమైన మార్పు దిశగా ఎదురుచూస్తుంది అని, క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, BJP కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు దేశ ప్రజలు విసిగిపోయిన సమయంలో కేసీఆర్ దేశానికి ఒక్క దిక్సుచి లాగా కనపడుతున్నారు అని,కర్ణాటక,మహారాష్ట్ర, వంటి సారి హద్దు రాష్ట్రాలు మన రాష్ట్ర పథకాలు వాళ్ల రాష్టలలో అమలు అవుతే బాగుండు నని ఎంతో ఆశగా ఎదురుచుచుస్తున్నారు అని ఇదే సమయంలో దేశ్ కి నేత గా కేసీఆర్ నిలుస్తారు అని, దేశ ప్రజలకు కనీస అవసరాలు అయిన రైతు పండించే కుడు, ఉండడానికి గూడు, కట్టుకోవడానికి బట్ట , అందరికి విద్య ,నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో తెరాస పార్టీ ని BRS పార్టీ గా మార్చడం జరిగినది అని, తెరాస పార్టీ స్థాపించి 14 ఏండ్లు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ను సాధించి, సాధించిన రాష్ట్రం ను 8 ఏండ్ల సుపరిపాలన లో అనతి కాలంలోనే రోల్ మోడల్ గా దేశం మన వైపు చూసేలా అభివృద్ధి ,సంక్షేమం తో అలరారిస్తూ అన్ని రంగాలలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తుంది ఆని ,ఇదే స్ఫూర్తి తో తెలంగాణ రాష్ట్రం ను రోల్ మోడల్ గా చూపిస్తూ దేశం ను బంగారు భారతదేశం గా తీర్చిద్దిడడం కోసం విజయదశమి రోజున మరో నవ శకనికి నాంది పలకడం చాలా సంతోషకరమైన విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

మన తెలంగాణ రాష్ట్రం లో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశం అంతటా అమలు కావాలని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందించడం, రైతు బంధు, రైతు బీమా ,కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ ,24 గంటల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలు దేశంలో ఆదర్శంగా నిలిచాయి అని, దేశ ప్రయోజనాల దృష్ట్యా అన్ని రాష్ట్రాలలో తిరిగి ,అందరి అభిప్రాయాలు తీసుకొని ,భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకొని BRS పార్టీ ని ప్రకటించడం జరిగినది అని, మన దేశం చాలా గొప్ప దేశం అని ,వి భిన్న సంస్కృతులు,విభిన్న ఆచారాలు కలిగిన మహోన్నత మైన సువిశాలమైన దేశం మనది ,గొప్ప సంస్కృతి, చరిత్ర కలిగిన దేశం మనది. మన దేశంలో అపారమైన వనరులు ఉన్నాయి అని వాటిని సద్వినియోగం పర్చుకోని వాటి ఫలాలు పేద ప్రజలకు అందినప్పుడే మన దేశం గర్వించే స్థాయిలో ఉంటుంది అని , నదుల అనుసంధానం ద్వారా సముద్రంలో కలిసే నీటిని ఒడిసిపట్టుకొని ప్రజలకు త్రాగు నీరు, సాగు నీరు అందించాలని వనరులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ,ప్రపంచం చూపు భారత దేశం వైపు తిప్పేలా శక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే ఉంది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణను ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ నెంబర్ గా తీర్చిదిద్దారో అదే విధంగా దేశం మొత్తం కెసిఆర్ లాంటి నాయకుని కోసం ఎదురుచూస్తున్నారని. దేశ ప్రజలకు ప్రతినిధిగా కెసిఆర్ ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని మనసారా కోరుకుంటూ కెసిఆర్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.


SAKSHITHA NEWS