SAKSHITHA NEWS

సాక్షిత : హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని వినాయక నగర్ కాలనీ లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ గృహ యజమానులందరి సహకారంతో నిర్మించిన కాలనీ వెల్ఫేర్ అదనపు భవనం ను కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్ , హమీద్ పటేల్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ  వినాయక నగర్ కాలనీ లో కాలనీ వాసులు ,కాలనీ అసోసియేషన్ సభ్యులు కలిసి కాలనీ వెల్ఫేర్ అదనపు భవనం నిర్మించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ,ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలిచారు అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు. తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం అని ,భవనం కాలనీ సంక్షేమం ,అభివృద్ధి కోసం చక్కగా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ లో సమావేశాలు, సభలు, చిన్న చిన్న ఫంక్షన్ లు , జన్మదిన వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా భవనం నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కాలనీ అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తానని ,మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధం అని ,ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి వచ్చిన పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .హఫీజ్పెట్ డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయ షెక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ సందర్బంగా  కాలనీ వాసులు  మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే కమ్యూనిటీ హాల్ నిర్మాణం కు అన్ని విధాలుగా సహకరించినందుకు , ప్రారంభించుకోవడం చాలా సంతోష్కారంగా ఉంది అని దీనికి సహకరించిన ఎమ్మెల్యే గాంధీ కి కార్పోరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ , జగదీశ్వర్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని ,అదేవిధంగా ఎమ్మెల్యే గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కాలనీ వాసులు కొనియాడారు .

ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ ,మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాలా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి,దాత్రి గౌడ్, రఘునాథ్, వెంకటేశ్వరరావు, దామోదర్ రెడ్డి, బాబు మోహన్ మల్లేష్ ,అబ్దుల్ రహమాన్ మరియు కాలనీ వాసులు కనికి రెడ్డి, ప్రసాద్, సుభాష్ రావు, సుభాష్ చంద్రబోస్, నవీన్ ,సుబ్రమణ్యం రాజు, శ్రీకాంత్, కార్తిక్ మరియు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS