SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 05 at 4.38.45 PM

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 6,50,000/- ఆరు లక్షల యాబై వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని

CMRF – వివరాలు

1.గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని దర్గా కి చెందిన శ్రీమతి శోభ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 2,50,000/- రెండు లక్షల యాబై వేల రూపాయలు.

2.హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ కి చెందిన శ్రీమతి పద్మావతి కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 2,00,000/- రెండు లక్షల రూపాయలు.

3.శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ కి చెందిన శ్రీమతి అన్నపూర్ణ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,00,000/- ఒక లక్ష రూపాయలు.

4.కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ కి చెందిన నాగరాజు కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,00,000/- ఒక లక్ష రూపాయలు.

మొత్తం 6,50,000 /- ఆరు లక్షల యాబై వేల రూపాయలుగా మంజూరి అయినవి అని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాశినాథ్ యాదవ్ ,వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS