Government schools reopened with problems, future of students in question....... CPI
సమస్యలతో పునః ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు, ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థుల భవిష్యత్తు……. సిపిఐ
అనుమతులు లేని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నపాఠశాలలను సీజ్ చేయాలని డిమాండ్*
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని జిల్లా విద్యాశాఖ డైరెక్టర్ అసిస్టెంట్ విజయలక్ష్మి కి వినతి
సాక్షిత వనపర్తి జూన్ 12
జిల్లాలో సమస్యలతో పునః ప్రారంభమైన విద్యా సంవత్సరం. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది .
ఒకే జత యూనిఫామ్ మాత్రమే పంపిణీకి సిద్ధంగా ఉంది. మరి రెండో జత ఏది అని
70 శాతం మంది విద్యార్థులకు మాత్రమే కొత్త పాఠ్యపుస్తకాలు మిగతా 30 శాతం మంది విద్యార్థులకు పాత పుస్తకాలే శరణ్యమా..
విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలనీ సిపిఐ తరపున జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీరామ్, రమేష్ గోపాలకృష్ణ లు డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా విద్యాశాఖ డైరెక్టర్ అసిస్టెంట్ విజయలక్ష్మికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ
2024 -25 విద్యా సంవత్సరం నేటి నుండి ప్రారంభం అవుతుందని సమస్యల వలయంలో విద్యా సంవత్సరం ప్రారంభం అవడం జరిగిందని . ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయులు లేక పోవడంతో పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులకు పాఠాలు ఎవరు బోధించాలని వారు ప్రశ్నించారు. జిల్లా అధికార యంత్రాంగం ఆగ మేఘాల మీద యూనిఫామ్ ను సరఫరా చేసి కుట్టించారని అది కూడా ఒక జత మాత్రమే అందుబాటులో ఉందని రెండో జతను తక్షణమే తెప్పించి కుట్టించి విద్యార్థులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరం కూడా పాఠ్యపుస్తకాలు 70 శాతం మంది విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయని మిగతా 30% విద్యార్థులకు పాత పాఠ్యపుస్తకాలను అందించే ప్రయత్నం చేస్తున్నారని ఇది తగదని వారు విమర్శించారు తక్షణమే కొత్త పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందరికీ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మన ఊరు మనబడి పేరుతో కనీస మౌలిక వసతులను కల్పించాలని ఉద్దేశంతో జరుగుతున్న పనులు నాసిరకంగా మరియు నత్తనడకగా సాగుతున్నాయని. వెంటనే నాణ్యమైన పనులను మరమ్మత్తులను త్వరగా పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని. ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని. ప్రవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ యూనిఫామ్.బెల్ట్.షూ. టై.లాంటి వస్తువులను అమ్ముతున్న పాఠశాలలపై యాజమాన్యంపై.క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేని పాఠశాలలను రద్దు చేయాలని. ఇటీవల కాలంలో కొత్తగా రెండు కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు అనుమతి లేకుండా అడ్మిషన్లు గత మూడు నెలల నుంచి చేర్పిస్తున్నారని ఆరోపించారు.వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని. విద్య హక్కు చట్ట ప్రకారం ప్రతి ప్రవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25% సీట్లను ఉచితంగా ఇవ్వాలన్న నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసి సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు లక్ష్మీ నారాయణ మైబూసి తదితరులు పాల్గొన్నారు.