SAKSHITHA NEWS

Government schemes are available to every household

ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి.


సాక్షిత తిరుపతి : సత్వరమే సమస్యలు పరిష్కారం
జోరు వానలో డివిజన్ బాట
అధికారులు, నాయకులతో 27వ డివిజన్లో పర్యటన మేయర్ డాక్టర్ శిరీష

నగరపాలక పరిధిలోని 27వ డివిజన్ లో తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పర్యటించారు.

అధికారులు, సచివాల సిబ్బంది, డివిజన్ నాయకులతో మంగళవారం సాయంత్రం 27వ డివిజనలో మల్లయ్య గుంట కట్ట, తాతయ్య గుంట కట్ట, పెద్ద కాపు వీధి, తాతానగర్, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడి సమీపంలో పర్యటించి ప్రజలు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. జోరు వానలో సమస్యలు తెలుసుకుంటూ అప్పటికప్పుడు పరిష్కరించడం జరిగింది.


మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ నేడు 27 డివిజన్ లో అధికారులు, నాయకులతో డివిజన్ బాట పట్టి సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించడం జరిగిందని తెలిపారు. తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ప్రతిరోజు గడప గడప కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతూ మరియు సమస్యలు ఉంటే అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు‌. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి లబ్ధి పొందాలని పెన్షన్లు, చేయూత, ఇంటి పట్టాలు, కాపు నేస్తం మొదలగు పథకాలు అందాయని డివిజన్ ప్రజలు చాలా సంతోషంగా తెలియజేశారన్నారు.


అధికారులు, సచివాల సిబ్బంది, నగరపాలక సిబ్బంది నగరంలో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.
మేయర్ డాక్టర్ శిరీష వెంట నగర పాలక డి.ఈ. దేవిక, శానిటరీ సూపర్వైజర్ సుమతి, వైయస్సార్ సిపి డివిజన్ నాయకులు తులసి యాదవ్, భరణి యాదవ్, సురేష్ యాదవ్, చింతా రమేష్, నాగేశ్వరరావు, వెంకట ముని, గజేంద్ర, మధు, గీతా యాదవ్, హేమ, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS