చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మండలంలో రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ మహిళలకి రంజాన్ తోఫాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
హిందు, ముస్లిం, క్రిస్టియన్లకు సమానంగా చూస్తూ వారి వారి పండుగలకు కేసీఆర్ బతుకమ్మ చీరెలు, రంజాన్ తోఫాలు, క్రిస్మస్ కానుకలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. రాష్టంలో పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న లక్ష్యంతోనే ప్రతి పండుగకు కేసీఆర్ కానుక అందిస్తున్నారన్నారు. ఈ ఏడాది అన్ని మతాల వారు కలసి ఈద్ ఉల్ ఫితర్‌ను సంతోష వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లింల కోసం మైనార్టీ కళాశాలలు, పాఠశాలలు, గురుకులాలు, షాదీ ముబారక్, ఇమామ్ లకి జీతాలు ఇలా ఎన్నో పనులు కేసీఆర్ ప్రవేశ పెట్టారన్నారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేసే వారికి ఇఫ్తార్ విందు కార్యక్రమం కూడా ప్రతి ఏటా ఇస్తున్నామన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో మసీద్ లకి స్థలాలు కేటాయించామని, చిట్యాల ముత్యాలమ్మ గూడెం కాలనీ వాసులకి మసీద్ కోసం స్థలాన్ని కేటాయించామని అన్నారు. రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ అన్ని వర్గాలు అన్ని మతాలు కూడా అభివృద్ది చెందాలనే కుల మతాల కతీతంగా అభివృద్ది చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు. ప్రతి పేదింటి ఆడబిడ్డ కి అండగా ఉండాలని కల్యాణలక్ష్మి షాదీ మూబారక్ లని ప్రవేశపెట్టారని, మైనార్టీ సంక్షేమ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కులమతాల మధ్య బిజెపి ప్రభుత్వం చిచ్చు పెట్టి ఇలాంటి విబజించి పాలించాలని చూస్తుందని అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ లో ఇప్పటి వరకు 20 కోట్ల అభివృద్ది పనులు చేశామని అన్నారు. మున్సిపాలిటీ చైర్మన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. షాదీ ముబారక్, పథకం పేదింటి ఆడబిడ్డ కి ఎంతో అండగా ఉంటుందని అన్నారు. ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య సారధ్యంలో ప్రతి పేదింటి అడబిడ్డ ఉన్నతంగా ఉండాలనే పథకాలను అందిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో మున్సిపాలిటీ ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్,జెడ్పీటీసీ సుంకరి ధనమ్మ యాదగిరి,
మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, వేలిమినేడు పిఎసిఎస్ చైర్మన్ రుద్రారపు బిక్షపతి, కౌన్సిలర్స్ బెల్లి సత్తయ్య,జిట్ట పద్మ బొందయ్య, జామండ్ల జయమ్మ శ్రీనివాస్ రెడ్డి, సిలివేరు మౌనిక శేఖర్, పందిరి గీత రమేష్, పెద్దకాపర్తి సర్పంచ్ జలంధర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు జమిరుద్దిన్, పాటి మాధవ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు రుద్రవరం పద్మ యాదయ్య, డిప్యూటీ తహశీల్దార్ రాగ్యా నాయక్, ఆర్ ఐ మల్లికార్జున్ రావు, ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, నాయకులు పాలెం మల్లేష్, పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్, పోలేపల్లి సత్యనారాయణ,కోనేటి ఎల్లయ్య,జయరపు శివ, గంట్ల శ్రీనివాస్ రెడ్డి,జగిని బిక్షం రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ముబీన్, చిత్రగంటి ప్రవీణ్, కన్నెబోయిన శ్రీశైలం, గౌస్, ఉమాశేంకర్,భాస్కర్, వివిధ హోదాలలో ఉన్న నాయకులు కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.