SAKSHITHA NEWS


Good morning Alvin Colony..

గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ..

యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ కార్యక్రమంలో భాగంగా 124 డివిజన్ పరిధిలోని మహాత్మాగాంధీ నగర్ మరియు గణేష్ నగర్ పరిసర ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు.

యువనేత మాట్లాడుతూ కాలనీలో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని.. చెత్తను రోడ్ల మీద లేదా నాలాలలో వేయడం వల్ల మీరు మీ పిల్లలు రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి మీరందరు మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని, తడిచెత్తా మరియు పొడిచెత్తను వేరువేరుగా బస్తీకి వచ్చి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని, చెత్తను నాలాలలో గాని, రోడ్లమీద గాని, చెరువులలో గాని వేయవొద్దని ప్రజలను కోరారు.

కాలనీలో కొన్ని చోట్ల రోడ్లు మంజూరై పెండింగులో ఉన్న పనులను గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు.

కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, వాసుదేవరావు, ప్రదీప్ రెడ్డి, అగ్రవాసు, అర్వరవి, సంతోష్, శ్యామ్, కైసర్, ఆదర్శ్, ఇంతియాజ్, దనుంజయ్, ఎం.వెంకటేష్, రసూల్, కటికరవి, ప్రభాకర్, సుల్తాన్, ఇక్బాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS