సాక్షిత : దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ మూడోవ విడత కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని మహావీర్ నగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. యువనేత మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా వీధులలో చెత్త వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ గుడ్ మార్నింగ్ అల్విన్ కాలనీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కాలనీలో కొన్ని ఇండ్లలోని మంజీరా వాటర్ పైప్ లైన్లకు లివర్ లేకపోవడంతో త్రాగు నీరు వృధాగా పోతుందని వెంటనే ఆన్ ఆఫ్ లివర్ అమర్చి త్రాగునీరు వృధా పోకుండా చూడాలని కాలనీ వాసులకు సూచించారు. కాలనీలోని ఒక గల్లీలో సీసీ రోడ్డు నిర్మించవలసి ఉందని అదికూడా శాంక్షన్ అయి ఉంది కాబట్టి అతిత్వరలో నిర్మాణ పనులు మొదలు పెడతారని అన్నారు. కాలనీలో కొన్ని చోట్ల విద్యుత్ స్తంబాలు లేక రాత్రి సమయంలో కాలనీ ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, అగ్రవాసు, విరేశం, హరీష్, వాలి నాగేశ్వరరావు, రాజు పటేల్, మహేష్, కూర్మయ్య, నారాయణ, మల్లేష్, రామ్ చందర్, రాఘవయ్య, ఆంజనేయులు, గోరేమియా, శ్రీను, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ..
Related Posts
ఉండ్రుగొండను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి
SAKSHITHA NEWS ఉండ్రుగొండను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: చివ్వెంల మండలం ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయ కమిటీ…
అంబరాన్నంటిన కాకతీయ కమ్మ సంక్షేమ సంఘ వనభోజనం మహోత్సవాలు
SAKSHITHA NEWS అంబరాన్నంటిన కాకతీయ కమ్మ సంక్షేమ సంఘ వనభోజనం మహోత్సవాలు(నవంబర్ 10, సాక్షిత ప్రతినిధి కోదాడ) సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోఆధ్యాత్మికతకు ఐక్యతకు స్నేహభావాలకు కార్తీక మాస వనభోజన మహోత్సవాలు ప్రతీకలు అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు…