Goli Srinivas Reddy, a leader who has not sought office for 20 years, will preside over the services
20 సంవత్సరాలుగా పదవి ఆశించని నేత గోలి శ్రీనివాస్ రెడ్డి సేవలను అధిష్టానం గుర్తించాలి
డిసెంబర్ 25. సాక్షిత ప్రతినిధి.
కల్వకుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాసరెడ్డి సేవలు ఎనలేనివి. ఆయన సేవలను అధిష్టానం గుర్తించి 2023 లోకల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి. ఈ పేరు తెలియని వారు అంటూ ఎవరు ఉండరు.
రాజకీయంలోకి వస్తే చాలు పదవులు కోరుకునే ఈ రోజుల్లో ఎలాంటి పదవులు కోరుకోకుండా ప్రజలే నా ప్రాణం ప్రజాసేవయే నా లక్ష్యం అంటూ ఉద్యమం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు 20 సంవత్సరాలు గడుస్తున్న ఏ పదవి ఆశించని నేతగా ప్రజల మన్ననలు పొందుతూ ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం సహాయం చేస్తూ.
పార్టీలకు సంబంధం లేకుండా ఎవరైనా అనారోగ్య పాలై హైదరాబాద్లో చికిత్స పొందుతుంటే మెరుగైన వైద్యం అందించడంలో డాక్టర్లతో మాట్లాడి అట్టి వ్యక్తులకు సహాయం చేసే గొప్ప గుణం ఉన్న వ్యక్తి రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి అని సేవ చేయడంలో ఉన్న ఆనందం ఎందులో లేదని ఇలా ఎంతోమందికి సేవలు చేస్తూ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని.
మచ్చలేని నేతగా నిస్వార్థ సేవకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి గత 20 సంవత్సరాలుగా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు చేస్తున్న సేవలకు గాను అధిష్టానం గుర్తించి 2023లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో గోలి సేవలను గుర్తించి బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వాలని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.
కల్వకుర్తి నియోజకవర్గం లోని మొదటి నుండి ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల కోసం నిస్వార్ధ సేవ అందిస్తూ, కల్వకుర్తి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, మృతి చెందిన కుటుంబాలకు 5000 తక్షణ సహాయం అందిస్తూ, ప్రమాదాలు చోటుచేసుకుని గాయాలు అయిన కుటుంబాలని పరామర్శిస్తూ వారికి అండగా ఉంటూ ఆర్థిక సహాయం చేస్తూ,
విద్యార్థులకు చదువుల కోసం ఆర్థిక సహాయాలు అందిస్తూ, ఆపదలో ఉన్నవారిని నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఆదుకుంటున్నాడని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు చేసిన సేవలకు గాను కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ను గోలి శ్రీనివాస్ రెడ్డికి కేటాయించాలని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు అధిష్టానాన్ని కోరుతున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రులలో చేరిన వారు ఏ పార్టీ వ్యక్తి అయినా పార్టీలు చూడకుండా సహాయం చేసే గొప్ప గుణం ఉన్న ఏకైక వ్యక్తి. పేదల పెన్నిధి.
పేదల ఆపద్బాంధవుడు కల్వకుర్తి నియోజకవర్గంలో ఆపద లో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పిస్తూ అండగా నిలుస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నా గోలి శ్రీనివాస్ రెడ్డి. నిరుపేద విద్యార్థులు ఆర్థిక సోమత లేక పై చదువుల కోసం విద్యని అందుకోలేకపోతున్న విద్యార్థులకు నేనున్నానంటూ చేయూతనిస్తూ ప్రోత్సహిస్తున్నాడని.
ఉద్యమా సమయంలో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనదైన ముద్ర వేసుకున్నాడని. ఏ పదవి లేకుండా ప్రజా ప్రతినిధులు ఉండలేకపోతున్నా ఈ కాలంలో గత 20 ఏళ్ల నుండి ఏ పదవి ఆశించకుండా ప్రజల కోసమే తన జీవితం అంకితం అంటున్న గోలి శ్రీనివాస్ రెడ్డి ని ఇకనైనా అధిష్టానం గుర్తించి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి సేవలను కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ గోలి శ్రీనివాస్ రెడ్డికి కేటాయించాలని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు అధిష్టానాన్ని కోరుతున్నారు.