Giving a laptop to a poor student
పేద విద్యార్థినికి ల్యాప్‌టాప్ అందజేత
విద్యార్థిని స్వర్ణకు ల్యాప్‌టాప్ అందజేస్తున్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు మందడపు రాణి
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
నిరుపేద విద్యార్థినికి సిపిఐ మాజీ రాష్ట్ర నాయకులు అమరజీవి కామ్రేడ్ మందడపు నాగేశ్వరరావు సతీమణి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు మందడపు రాణి చేతులమీదుగా మండల పరిధిలోని మల్లవరం గ్రామంలో ఉన్న నాగేశ్వరరావు స్మారక స్తూపం వద్ద 40 వేల రూపాయల విలువ గల ల్యాప్‌టాప్ ను గొల్లమందల స్వర్ణకి అందజేశారు.మండలంలోని మల్లవరం గ్రామానికి చెందిన గొల్లమందర స్వర్ణ ఇంజనీరింగ్ చదువుతోంది.
ఆమెకు ల్యాప్‌టాప్ కొనడానికి ఆర్థికంగా స్వర్ణది పేద కుటుంబం కావడంతో స్వర్ణ తల్లిదండ్రులు గొల్లమందల ప్రభాకర్,లలితమ్మ మందడపు రాణిని సంప్రదించి మా కుమార్తె స్వర్ణ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ (కంప్యూటర్ సైన్స్)సానా ఇంజనీరింగ్ కాలేజీ కోదాడలో చదువుతుందని తన చదువుకి ల్యాప్‌టాప్ అవసరం ఉన్నదని అందుకు మా ఆర్థిక పరిస్థితితో ల్యాప్‌టాప్ కొనే స్థితిలో లేనందున స్వర్ణకి సహాయం చేయాలని విజ్ఞప్తి చెయ్యగా వెంటనే స్పందించి మందడపు రాణి అమరజీవి కామ్రేడ్ మందడపు నాగేశ్వరావు జ్ఞాపకార్థగా స్వర్ణకి ల్యాప్‌టాప్ అందజేశారు.ఈ సందర్భంగా రాణి మాట్లాడుతూ,విద్యార్థినిలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.
ముఖ్యంగా చదువుల్లో మహిళలు ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులకు, కుటుంబానికి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆమె సూచించారు.అలాగే త్వరలో ఎం.ఎన్.ఆర్(మందడపు నాగేశ్వరరావు)ట్రస్ట్ పేరుతో ప్రారంభిస్తున్నట్లు రాణి తెలిపారు.ఈ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు భవిష్యత్తులో సహాయం అందించనున్నట్లు ఆమె తెలిపారు.