SAKSHITHA NEWS

శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి హైదరాబాద్ రోడ్ పక్కన గల అయ్యప్ప దేవాలయంలో గీత పారాయణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా, అఖండ పారాయణం చేశారు. గురు స్వామి మిరియాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. గురుస్వాములు దండుమోహన్, గుండ శేఖర్, సాత లింగం మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అయ్యప్ప దేవాలయం ఏర్పాటు అయిందని, శబరిమల లో ఉన్న అయ్యప్ప దేవాలయం లాగే శంకర్పల్లిలో నిర్మాణం జరిగిందని అన్నారు.

ప్రజల విరాళాలతో ఆలయం పూర్తిచేసుకుని భక్తుల రాకపోకలతో ప్రతిరోజు భజన కార్యక్రమాలతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతుందని పేర్కొన్నారు. మండల దీక్షలకు అనుగుణంగా ప్రతిరోజు సుమారు 500 మంది అయ్యప్ప స్వాములకు అన్నదానాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. సివిల్ స్వాములు కూడా ప్రతిరోజు అధిక సంఖ్యలో అయ్యప్ప ఆలయాన్ని సందర్శించి దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బెజగం రాజేశ్వర్, దండు వేణుగోపాల్, కందూరి చంద్రకుమార్, మాశెట్టి పూర్ణచందర్, మాశెట్టి సురేష్, మహిళలు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 12 16 at 5.17.33 PM

SAKSHITHA NEWS