SAKSHITHA NEWS

బాలికలు అన్ని రంగాలలో రాణించారు.*

ఎస్ జి ఎఫ్ అండర్ 14 &17 బాలికల జిల్లా స్థాయి టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నందు 68 వ ఎస్ ఎఫ్ జి అండర్ 14 &17 బాలికల జిల్లా స్థాయి టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

ఎమ్మెల్యే కి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు, సెక్రెటరీ గారు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు .

క్రీడాకారులను ఎమ్మెల్యే పరిచయం చేసుకున్నారు .

వాలీబాల్ పోటీలను ప్రారంభించారు ఎమ్మెల్యే .

ఎమ్మెల్యే మాట్లాడుతూ…..

విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో కూడా నైపుణ్యం పొంది ఉండాలి క్రీడల వల్ల మనకు మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని పెంచుతుంది. క్రీడలో వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
ప్రతి ఒక్కరు క్రీడలను మంచి నైపుణ్యత ను సాధించాలి నేడు జరగబోయే జిల్లా స్థాయి టోర్నమెంట్లో పాల్గొని క్రీడలను మంచిగా ప్రదర్శించాలని కోరారు.

జిల్లాస్థాయిలో నుండి భవిష్యత్తులో రాష్ట్రస్థాయి టోర్నమెంట్ లో కూడా గద్వాల చెందిన బాలికలు మంచిగా తమ క్రీడా నైపుణ్యాత ను ప్రదర్శించి గద్వాల ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా కృషి చేయాలి భవిష్యత్తులో మంచి క్రీడాకారిగా ఎదగాలని కోరారు. 

ప్రతి ఒక క్రీడాకారులు గెలుపు ఓటమి సమానంగా స్వీకరించాలి. ఓటమి విజయానికి నాంది ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మురళి, మాజీ ఎంపీపీ విజయ్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, మాజీ సర్పంచ్ మాజీద్, మాజీ ఎంపీటీసీ ఆనంద్ గౌడు నాయకులు గోవిందు, ఆలూరు రామయ్య శెట్టి, కురుమన్న, ధర్మ నాయుడు, పవన్ యూదవ్, వీరేష్, గాంధీ, మహేష్, క్రీడాకారులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ‌.


SAKSHITHA NEWS