GHMC Engineering Department on the steps to be taken on the canal widening works
సాక్షిత : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీ లో గల నాల విస్తరణ పనుల పై తీసుకోవాల్సిన చర్యల పై GHMC ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు మరియు మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సాయి వైభవ్ కాలనీ లో గతంలో వర్షాలకు నాల పొంగి కాలనీ అంతా ముంపుకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి విదితమే నని ,ఇట్టి విషయం ను దృష్టిలో పెట్టుకొని కాలనీ లో గల నాల విస్తరణను పొడిగించాలని అధికారులను ఆదేశించారు,
నాల విస్తరణ మరియు పొడిగింపు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, ప్రజలకు ప్రశాంత వాతావరణం కలిపించాలని అధికారుల కు ప్రభుత్వ విప్ గాంధీ ఆదేశించారు, నాల పొంగకుండా రాబోయే వర్షకాలం లోపు పనులు పూర్తి చేయాలని నాల విస్తరణ పనుల పై పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా కాలనీ లో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, కాలనీ లో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శ్రీనివాస్ DE విశాలాక్షి, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ TPS రవీందర్ బీఆర్ ఎస్ నాయకులు ప్రసాద్, రమేష్, మరియు
సాయి వైభవ్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ అశోక్ రాజు, పద్మావతి జనరల్ సెక్రటరీ, కాలనీ వాసులు అప్పారావు, దిలీప్, సుధాకర్ ,బాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు