SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనీ ఖమ్మం బిసి హల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు కొప్పుల రామారావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ హాజరై మాట్లాడుతు ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లాల నుండి పాల్గొన్న కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలిపినారు, ముందుగా మృతి చెందిన ప్రజ యుద్దనౌక గద్దర్ కి రెండు నిమిషాలు మౌనం పాటించారు తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో 119 కి,
119 నియోజకవర్గాలలో పోటిలో మన అభ్యర్థులు ఉండాలని అన్నారు.


డాక్టర్ బి అర్ అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ పార్టీ “రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియ” ప్రకాష్ అంబేద్కర్ తో కలిసి పని చేయడానికి బహుజనులు ముందుకు వచ్చి పని చేయాలని కోరారు, కేంద్రంలో ఉన్న బిజెపి ఎన్నికల వాగ్దానాలను పక్కకు పేట్టి కలిసి ఉన్న వారిని విడకొట్టడనికి మత కుల రాజకీయాలు చేస్తున్నారని, కేంద్రంలో ఉన్న బిజెపి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి బ్యాంక్ అకౌంట్ లో 15లక్షలు వేస్తామని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినరని అన్నారు, కొత్త ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలు ఉడగొడుతున్నరని అన్నారు, రిజర్వేషన్ లు పోతే ఎక్కువగా నష్టపోయేది బిసిలే ఎక్కువ నష్టపోతారనీ,తరువాత ఎస్ సి ఎస్ టి లకు అన్యాయం జరుగుతుందని అన్నారు,

రాష్ట్రంలో బిఆర్ఎస్ మాటలకు కోటలు కట్టడం తప్ప చేసింది ఏమీ లేదని అన్నారు, వరదలో వర్షాలతో ప్రజలు నష్ట పోతుంటే, బిజెపి బిఆర్ఎస్ లు పేపర్ లలో టీవీలలో పార్టీ పబ్లిసిటీలకు ప్రజా ధనాన్ని లక్షలు ఖర్చు చేస్తున్నారే తప్ప వరద బాధితులకు మాత్రం సాయం అందించడంలో విఫలమయ్యారని అన్నారు, దళిత గిరిజన బిసి మైనార్టీ బంధు బిసి వృత్తి వారికి లక్ష రూపాయలు అంటు ఇప్పుడేమో ఇంటి స్థలం ఉంటే మూడు లక్షలు ఇస్తామంటూ, ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తామని జరగని హామీ ఇచ్చి ఓట్ల రాజకీయాలు చేయడం తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని అన్నారు,

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో భద్రాద్రి జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు,రాష్ట్ర నాయకులు ఎం శ్రీనివాస్, పి.మదు, మోహన్ చందు, నాగులు వీర, కొప్పుల కృష్ణవేణి, పి అరుణ, తదితరులు పాల్గొన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్ పి ఐ ప్రకాష్ అంబేద్కర్ పార్టీ కమ్మం జిల్లా అధ్యక్షులు గా కొప్పుల రామారావు ని నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ తెలిపినారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గా గడ్డం వెంకటేశ్వర్లు ని నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ తెలిపినారు


SAKSHITHA NEWS