గట్టు మండలంలో ఉన్న విద్య, వైద్య, పారిశుద్ధ్య సమస్యల పైన అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహాన్ గారితో సమావేశమై మండలంలో జరుగుతున్నటువంటి మన ఊరు మనబడి పనుల పురోగభివృద్ధిపై పూర్తిస్థాయిలో సమీక్షించాలని.. అదేవిధంగా టీచర్ల కొరతను అధిగమించే దిశగా ప్రత్యేక శ్రద్ధతో విద్యా వాలంటరీలను ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు పాఠశాలలకు సకాలంలో చేరుకొనుటకు సరైన బస్సు సౌకర్యాలు నడపాలని. వైద్యరంగంలో గట్టులో మూడు ప్రాథమిక వైద్య సబ్ సెంటర్ ల నిర్మాణంను పూర్తి చేసుకున్నందున వెంటనే వాటిని ప్రారంభించి వాటిలో పల్లె దవాఖాన స్థాయిలో డాక్టర్లను ఏర్పాటు చేయాలని. గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత తీర్చాలని.
గ్రామాలలో హరితహారం కార్యక్రమాన్ని వేగవంతం చేయుటకు నిత్యం గట్టు మండలంలో పర్యటిస్తూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ మండలాభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరించాలని అడిషనల్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది.