Garbage basket distribution program for sanitation workers working in Hyder Nagar Division
సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలో ని హెచ్యేంటి కమ్యూనిటీ హాల్ లో హైదర్ నగర్ డివిజన్ లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమంలో, పారిశుధ్య సిబ్బందికి చెత్త బుట్టలను అందచేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .
ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది తల్లిదండ్రులతో సమానం అని , కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు మన పరిసర ప్రాంతాలను, కాలనీ లను అద్దము లాగా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతు నిత్య శ్రామికులు గా పనిచేస్తున్నారు అని, పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా పనిచేస్తారు అని వారి సేవలను కొనియాడారు. వారికి మరింత అనువుగా ఉండేందుకు గాను చెత్త బట్టలు అందచేయడం జరిగినది అని, కాలనీ లలో రోడ్ల ను ఊడ్చే సమయంలో చెత్త ను సేకరించడానికి వీలుగా ఈ చెత్త బుట్టలు ఎంతగానో దోహద పడతాయి అని, సేకరించిన చెత్తను రిక్షా లో వేసేంత వరకు చక్రాల తో కూడిన చెత్త బుట్టలు అనువుగా ఉంటాయి అని, చెత్తను సేకరించడానికి సులభతరంగా పని చేస్తాయి అని నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.
అదేవిదంగా ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచడమే కాకుండా వారి ఆరోగ్యము కూడా మన బాధ్యత అని పారిశుధ్య కార్మికులను కాపాడుకోవాలనే ధ్యేయం తో ముఖ్యమంత్రి కేసీఆర్ సహృదయంతో ఆరోగ్య పరిరక్షణకు PPE కిట్ల ను కూడా అందచేయడం జరిగినది అని, పారిశుధ్య సిబ్బంది ఆరోగ్య భద్రతే మన భద్రత అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. వీటిని సద్వినియోగ పర్చుకొని కానీలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శానిటేషన్ సూపర్ వైజర్ లింగారెడ్డి, SRP సత్యనారాయణ ఎస్ఎఫ్ఐ లు వారి సిబ్బంది మరియు తెరాస నాయకులు గోపీచంద్, రాజుసాగార్, కృష్ణ, రామచంద్ర రెడ్డి, అప్పారావు, కె యస్ ఆర్ మూర్తి, గాంధీ, రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.