కష్టజీవుల కన్నీటి గాధలే గద్దర్ పాట
హుస్నాబాద్ లో ప్రజాసంఘాల నివాళిసభ
సాక్షిత – సిద్దిపేట బ్యూరో :
కష్టజీవుల కన్నీటి గాధలను పాటగా ఆలపించి, నిరంతరం శ్రమజీవుల పక్షాన పోరాడిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ అని పలువురు వక్తలు కొనియాడారు.
ఇటీవల మరణించిన గద్దర్ మరియు సియాసత్ ఎడిటర్ జహీర్ అలీఖాన్ లకు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కన్నీటి నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం గద్దర్ ఎంతో ఆకాంక్షించాడని అన్నారు. ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలని ఆరాటం చెందే వాడన్నారు. హుస్నాబాద్ ప్రాంతంతో గద్దర్ కు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి శిథిలమైన స్థూపం స్థలంలో స్మృతి వనం ఏర్పాటు చేసి గద్దర్ విగ్రహాన్ని నెలకొల్పాలని అన్నారు. ట్యాంక్ బండ్ పైన గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజాస్వామిక వాది జహీరుద్దీన్ కి ఘనంగా నివాళులు అర్పించారు.
ముక్కెర సంపత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు కేడం లింగమూర్తి, మేకల వీరన్న యాదవ్, కొయ్యడ కొమురయ్య, పందిల్ల శంకర్, వెన్న రాజు, చింతల రామచంద్రం, గొర్ల ఐలేష్ యాదవ్, రషీద్ ద్రావిడ్, రాయబోసు, బూరుగు కిష్టస్వామి, సతీష్, గద్ద సంపత్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, నాయకులు కోమటి సత్యనారాయణ, పోలోజు రవీందర్, అక్కు శ్రీనివాస్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు