SAKSHITHA NEWS

Gadapa-Gadapaku is our government's ambitious undertaking

వజ్రపుకొత్తూరు మండలం, పాతటెక్కలి పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇంఛార్జ్ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు .

ముందుగా పంచాయతీకి చేరుకున్న మంత్రి డాక్టర్ సీదిరి కి ఘన స్వాగతం పలికిన లింగాలపాడు గ్రామ మహిళలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు

.

కార్తీక మాస పర్వదినాలు సందర్భంగా మహాశివుని దేవాలయాల్లో అలాగే శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయం మరియు శ్రీ సీతారామ దేవాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి డాక్టర్ సీదిరి

.

అలాగే లింగాలపాడు గ్రామంలో యం.పి.పి స్కూల్ మరియు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వాటి పునః నిర్మాణం కోసం ఉన్నతాధికారులతో మాట్లాడారు.

అలాగే ఆ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా లబ్దిదారులతో సంక్షేమ పథకాలు గురించి సమీక్షించారు.

అనంతరం పాతటెక్కలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నేడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రతీ కుటుంబానికి వచ్చే సంక్షేమ పథకాలు వివరాలు ప్రతీ గడపకు వచ్చి వివరించి ప్రతీ అక్క చెల్లెమ్మను పలకరించి వెళ్లాలనే ఉద్దేశంతో నేడు మీ ఊరు వచ్చానని తెలిపారు..

పాతటెక్కలి పంచాయతీకి ఒక ప్రాముఖ్యత ఉందని,ఇక్కడ ఉండే ఉన్నత పాఠశాలలో నేను చదువుకోవలసి ఉన్నా మా ఊరి సమీపంలో ఉన్న మర్రిపాడు ఉన్నత పాఠశాలలో చదవవలసి వచ్చిందని చెప్పారు.

ఎంతో ప్రఖ్యాతమైన ఈ పాఠశాల అభివృద్ధికి మాత్రం ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీలు, నాయకులు ముందుకు రాకపోవడం, నేడు మన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రతీ పాఠశాలను నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసుకుంటున్నామని,

ఇందులో భాగంగానే ఈ హైస్కూల్ అభివృద్ధికి రూ 66 లక్షల 65 వేలతో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఆధునీకరణ చేసుకోవడం జరిగిందని, అలాగే రూ 87 లక్షలతో కాంపౌండ్ వాల్ కూడా ఈ స్కూల్ కి నిర్మించుకున్నామని అన్నారు.అంతే కాకుండా హైస్కూల్ అదనపు క్లాస్ రూమ్స్ నిర్మాణానికి రూ 1కోటి 12 లక్షలు హెచ్చించడం జరిగిందని తెలిపారు.

అలాగే యం.పి.పి స్కూల్ అభివృద్ధికి అలాగే కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సుమారు రూ 30 లక్షలు మన ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.

అంతే కాకుండా మన పిల్లలు సగర్వంగా స్కూల్, కాలేజీలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవడం కోసం నేడు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ స్కూల్ కి వెళ్లిన పిల్లవాడికి బ్యాగ్ మనమే ఇచ్చాం, బూట్లు మనమే ఇచ్చాం, పుస్తకాలు మనమే ఇచ్చాం, రుచికరమైన మధ్యాహ్నం భోజనం తోపాటు ప్రతీ సంవత్సరం అమ్మ ఒడి ద్వారా ప్రతీ సంవత్సరం రూ 15 వేలు ఇస్తూ ప్రతీ పేద పిల్లాడు చదువుకోగలగుతున్నాడని తెలిపారు.
అలాగే డిగ్రీ చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కడుతున్నాం. ప్రతి డిగ్రీ పిల్లవాడికి వసతి దీవెన కింద 20 వేలు ప్రతి అమ్మ ఖాతాలో జమ చేస్తున్నామన్నారు.

ఎకరాకు పంట రూపంలో పదివేలు వస్తుందో లేదో తెలియదు కానీ..వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రతి రైతు ఖాతాలో ప్రతీ సంవత్సరం రూ. 13,500 /- జమ చేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం., ఇప్పటికే రెండు విడతల రుణమాఫీ డబ్బులు మీ మీ ఖాతాల్లో జమ చేసామని,. గత ప్రభుత్వం మీకేమైనా రుణమాఫీ చేసిందా..? మన ప్రభుత్వం వచ్చిన తరువాత మాత్రమే సంక్షేమ పథకాలు ప్రతీ పేదవాడి అందుతున్నాయని అన్నారు.

అలాగే మీకు చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేసాం.. 45 సంవత్సరాలు దాటిన ప్రతి అక్క ఖాతాలో 18,750 రూపాయిల చొప్పున నాలుగు విడతల్లో 75 వేలు జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. చంద్రబాబు బ్యాచ్ అంత జగన్ మోహన్ రెడ్డి పప్పు బెల్లాల్లా పంచేస్తున్నాడు అని విమర్శిస్తున్నారని మంత్రి తెలిపారు. నిజంగా పొరపాటున చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలు ఏమైనా ఉంటాయా..? మహిళలు దీనిని గ్రహించి వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడుకి తగు గుణపాఠం చెప్పాలని తెలిపారు.

సూర్యుడు ఉదయించక ముందే మీ తలుపు కొట్టి.. మీ చేతులో పెంచిన పెన్షన్ని.. మీ ప్రతి అవ్వకి, తాతకి ఇచ్చేటటువంటి గొప్ప మనసున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఈ జనవరి నుంచి 2,750/- ఆ తరువాత ప్రతి నెల 3 వేలు అవ్వా.,తాతల ఖాతాలో జమ కాబోతుందని తెలిపారు

.

పిఎసిఎస్ నిధులు ద్వారా గుడామ్ నిర్మించుకోవడం జరిగిందని, అలాగే ఈ పంచాయతీలో సచివాలయం, రైతుబరోస కేంద్రం, విలేజ్ హెల్త్ సెంటర్ తోపాటు లింగాలపాడులో వాటర్ ట్యాంక్ నిర్మించుకున్నామని,పాతటెక్కలిలో కూడా ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.అంతేకాకుండా సీసీ రోడ్లు, ఎస్ డబ్ల్యూసి బిల్డింగ్, డ్రైనేజ్ దీంతోపాటు మడియావాని పేట వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణం అలాగే సుమారు రూ 15 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మించడం జరిగింది మంత్రి తెలిపారు.

అంతేకాకుండా ఈ పంచాయతీ అభివృద్ధికి తక్షణమే రూ 20 లక్షలు మంజూరు చేయడం జరుగుతుందని, నామినేషన్ పద్ధతిలో పనులు మొదలుపెట్టాలని సూచించారు.
మడియావానిపేట, చిన రామకృష్ణాపురం ప్రధాన రోడ్లు అతి త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే పూండీ మీదుగా నువ్వలరేవు ప్రధాన రోడ్ ని ఒక ఏడాది కాలంలో పూర్తి చేసి మీకు కానుకగా అందివ్వడం జరుగుతుందని మంత్రివర్యులు డాక్టర్ సీదిరి తెలిపారు.

అలాగే మహిళలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి నచ్చదని, మీకు ఇచ్చే సంక్షేమ పథకాలు పేరుతో ప్రభుత్వం డబ్బు వృధా చేస్తుందని తాను అనకుండా తెలుగుదేశం పార్టీ నాయకులతో అనిపిస్తున్నాడని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలు అమలు జరగవని, కావునా మహిళలు ఇది గమనించి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి మీ ఓటుతో సమాధానం చెప్పాలని మంత్రి డా సీదిరి అన్నారు

.

కరోనా కష్ట కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో లేడంటే అది ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చలవేనని అన్నారు..

ఈ సమావేశం అనంతరం లింగాలపాడు, పాతటెక్కలి,మడియావానిపేట, పామలవానిపేట, చిన్నరామకృష్ణాపురం గ్రామాల పెద్దలతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అమలు గురించి తెలుసుకొని ఏదైనా సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు రాని వారి వివరాలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరిగింది.

ఈకార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరి తోపాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు హనుమంతు వెంకట్రావు మాస్టారు , వజ్రపుకొత్తూరు మండల పార్టీ అధ్యక్షులు పుక్కళ్ల గుర్రయ్య నాయుడు,సభా అధ్యక్షులు స్ధానిక సర్పంచ్ తుంగాన సుశీలా ధర్మారావు ,ఎంపీపీ ప్రతినిధి ఉప్పరపల్లి ఉదయ్ కుమార్ , జడ్పీ వైస్ చైర్మన్ ప్రతినిధి పాలిన శ్రీనివాస్ , వైస్ ఎంపిపి ప్రతినిధి తమ్మినేని శ్రావణి శాంతారావు

,ఉప సర్పంచ్ జల్లు శశిభూషన్ ,పిఎసిఎస్ అధ్యక్షులు దువ్వాడ మధుకేశ్వరరావు , ఎంపీటీసీ బాలక శ్రీను , క్లస్టర్ ఇంచార్జులు వరదరాజు మరియు దున్న బాలరాజు , గ్రామ అధ్యక్షులు దాసరి దాలయ్య , బూత్ కన్వీనర్ కొల్లి జోగారావు ,జల్లు ఉషారాణి ,నర్తు ప్రేమ్ కుమార్ ,అనీల్, గణపతి,దానయ్య,ఆనంద్, ప్రకాష్,రాజు, మార్పు అప్పారావు, బల్లి కూర్మారావు, బల్లి రాము, తాతారావు,రమణయ్య,ఊర్వశి, తుంగాన కమలమ్మ, ఉషా మరియు మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS