సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
గత వారం రోజుల క్రితం ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
పెగడపల్లి మండల పర్యటన సందర్బంగా
R&B నుండి
కస్తూర్బా స్కూలు కు
పిల్లలు వెళ్లడానికి రోడ్డు బాగాలేదని సీసీ నిర్మాణం చేయాలని
స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఒరుగల శ్రీనివాస్ మండల నాయకులు చాట్ల విజయభాస్కర్ ఎమ్మెల్యే కి వివరించగా వారు వెంటనే స్పందించి స్కూల్ వద్దకు వెళ్లి పరిశీలన చేసి
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా
ఆర్ అండ్ బి రోడ్డు నుండి కస్తూర్బా స్కూల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయడానికి
12 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించారని
ఇట్టి పనులు త్వరలోనే ప్రభుత్వ విప్ వచ్చి ప్రారంభిస్తారని
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
బుర్ర రాములు గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు
నిధులు మంజూరు కృషి చేసిన విప్ కి కస్తూర్బా స్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు
ఆయన వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంధి మల్లారెడ్డి కడారి తిరుపతి పూసల తిరుపతి
తడగొండ రాజు బండారు శ్రీనివాస్ చెట్ల కిషన్ చాట్ల ప్రశాంత్ పలువురు నాయకులు ఉన్నారు