SAKSHITHA NEWS

బిఆర్ఎస్ నుండి బిజెపికి

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : పెన్ పహాడ్ మండలంలోని లింగాల గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీ నుండి 20 మంది సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 6 గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు… రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి పూర్తిస్థాయిలో అమలు చేయకుండానే ప్రజలను మోసం చేసిందని వానకాలం పెట్టుబడి సాయంగా రైతుబంధు ఇవ్వకుండా రైతులను దగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి సూర్యాపేట నియోజకవర్గంలో బిజెపి సభ్యత్వ కార్యక్రమం వేగంగా జరుగుతుందన్నారు..

అక్టోబర్ 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉన్నందున కార్యకర్తలందరూ వేగంగా సభ్యత్వాలు పూర్తి చేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో రణపంగ కృష్ణయ్య, సురేష్, ఇంజమూరి పవన్, అనిల్ ,నగేష్, వెంకన్న, నాగయ్య, రమణయ్య ,సైదులు ,గోపి ,సైదులు, సత్యనారాయణ, నగేష్, నరసయ్య, లచ్చయ్య, శేఖర్ ,నగేష్ ,వీరస్వామి లు ఉన్నారు

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి మధు, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి కేసరి శోభా రెడ్డి, మండల నాయకులు మామిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS