Fresh water pipeline being constructed in Nandamuri Nagar Colony
సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నందమూరి నగర్ కాలనీ లో నిర్మిస్తున్న మంచినీటి పైప్ లైన్ పనులను జలమండలి అధికారులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, నందమూరి నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు మంచి నీటి పైప్ లైన్ పనులను మొదలు పెట్టాము అని, అలానే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ ప్రశాంతి, సూపర్వైజర్ నరేంద్ర, జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, ఖదీర్, ఆశ్రఫ్, యాసిన్, నక్క శ్రీనివాస్, వెంకట్ రావు, జుబేద తదితరులు పాల్గొన్నారు