Frequent police inspections in suspected trouble areas
కృష్ణాజిల్లా
పామర్రు నియోజకవర్గం
అనుమానస్పద సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసుల ముమ్మర తనిఖీలు
సార్వత్రిక ఎన్నికలు – 2024 అనంతరం జరిగే అల్లర్లు/గొడవలు దృష్టిలో పెట్టుకొని, కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి ఆదేశాలు ప్రకారం… మండలంలో సమస్యాత్మక గ్రామాలు, అనుమానిత ప్రదేశాల్లో “కార్డన్ అండ్ సెర్చ్” కార్యక్రమం నిర్వహించిన పమిడిముక్కల సర్కిల్ పోలీసులు…
మండలంలో ఈరోజు గుడివాడ డిఎస్పీ పి.శ్రీకాంత్ పర్యవేక్షణలో, పమిడిముక్కల సీఐ యం.కిషోర్ బాబు, పమిడిముక్కల ఎస్సై కె.శ్రీనివాసు ల ఆధ్వర్యంలో తోట్లవల్లూరు ఎస్సై , కూచిపూడి ఎస్సై , మరియు పమిడిముక్కల సర్కిల్ పోలీస్ సిబ్బందితో కలిసి, మండలంలో సమస్యాత్మక గ్రామమైన అలినేకిపాలెం గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించిన పోలీసులు…
కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా, సమస్యాత్మక ప్రదేశాలు, అనుమానిత ప్రదేశాల్లో, అనుమానిత వ్యక్తులను ముమ్మర తనిఖీలు నిర్వహించిన పోలీసులు..
కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా అలినేకిపాలెం ప్రజలతో పమిడిముక్కల సీఐ మరియు పమిడిముక్కల ఎస్సై సమావేశం ఏర్పాటు చేసి, ఎన్నికలు అనంతరం గ్రామాలలో ఎటువంటి అల్లర్లు, హింసాయుత సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణం ఉండేలా ప్రతి పౌరుడు భాద్యతగా వ్యవహరించాలి అని ప్రజలకు సూచించారు
కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా సరైన పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నికలు అనంతరం గ్రామాలలో అల్లర్లు/గొడవలు జరగకుండా, తీసుకొను చర్యలలో భాగంగా, గ్రామాలలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులపై మరియు అనుమానాస్పదంగా పేలుడు పదార్థాలు, మారణాయుధాలు మరియు బాణాసంచా అక్రమ నిల్వలు ఉంచిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని పమిడిముక్కల సిఐ యం.కిషోర్ బాబు హెచ్చరించారు.
గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల గురించి గాని, ప్రేలుడు పదార్థాలు/మారణాయుధాలు అక్రమంగా నిల్వ ఉంచిన వారి గురించిన సమాచారం పోలీస్ వారికి తెలియపరిచిన ఎడలా, సదరు సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచబడును..