సిద్ధిక్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన రఘునాథ్ ఫౌండేషన్
మెగా హెల్త్ క్యాంప్ లో దాదాపు 500 మంది సిద్దిక్ నగర్ మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు ఉచిత వైద్య శిబిరంలో చికిత్స చేయించుకున్నారు. కనిపించని ఆ దేవుడు ఊపిరిపోస్తే, కనిపించే ఈ వైద్య దేవుళ్లు మనకు పునర్జన్మను ఇస్తారు అని ఫౌండేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ చెప్పారు. హోలిస్టిక్ హాస్పిటల్ చైర్మన్ DR. రామ చంద్ర గారు మరియు వారి హాస్పిటల్ బృందం సహకారం తో రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా కొండాపూర్ డివిజన్ లోని సిద్దిక్ నగర్ కాలనీ వాసులందరూ ఉపయోగించుకున్నందుకు రఘునాథ్ యాదవ్ గారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ పీరోజి గారు, కాలనీ వాసులు నందు, ఫాసిల్, గోపాల్ గౌడ్, లక్ష్మి భాయి, కొండల్ రెడ్డి, రాము యాదవ్, గణేష్ యాదవ్, మొహమ్మద్, చోటు భాయ్, వెంకటేష్, రఘునాథ్ ఫౌండేషన్ సభ్యులు అఖిల్,సుకుమార్, సాయి సందేశ్, కార్తిక్, సంగీత్, ముస్తక్, ఇమ్రాన్, శ్రీనివాస్, స్వర్ణ, అనిల్, నాగరాజ్, నరేశ్, సత్తి పండు, మరియు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు