200 యూనిట్లలోపు వాడే వారికి ఉచిత కరెంట్ పథకాలను ప్రారంభించేందుకు రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమవుతుతోంది. చేవెళ్ల వేదికగా.. భారీ బహిరంగ సభ నిర్వహించి, ప్రియాంక గాంధీని పిలిచి.. ఈ రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టబోతోంది తెలంగాణ సర్కార్. తెల్లరేషన్ కార్డు ఉన్నవారందరికీ.. ఈ రెండు పథకాలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
అయితే, మహాలక్ష్మి పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది.. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ.80 కోట్ల విడుదలకు అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500 సిలిండర్ పథకాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పథకానికి నిధుల విడుదలకు అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ పాలనాపరమైన ఉత్తర్వులిచ్చింది.