Free distribution of sportswear to 190 students from Uppala Charitable Trust
ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుండి 190 విద్యార్థులకు ఉచితంగా క్రీడా దుస్తుల పంపిణీ చేసిన తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్
సాక్షిత ప్రతినిధి. : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాల హాస్టల్ బాలికలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుండి ఉచిత క్రీడా దుస్తులు పంపిణీచేసిన తలకొండపల్లి ZPTC వెంకటేష్ విద్యార్థులు సమస్యలు
తెలుపడంతో వారికి గణితం టీచర్ లేకపోవడంతో ట్రస్ట్ నుండి ఏర్పాటు చేస్తానని SHO అనిత మేడం చెప్పడం జరిగింది.గణిత టీచర్ కి తన ట్రస్ట్ ద్వారా నెలకు జీతం ఇస్తానన్ని పాఠశాల విద్యార్థులకు వెంకటేష్ అన్న హామీ ఇవ్వడం జరిగింది.ఉప్పల వెంకటేష్ కి విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
6 నుండి 10వ తరగతి విద్యార్థులకు 190మంది బాలికలకు క్రీడా దుస్తులను పంపిణి చేయడం జరిగింది.అనంతరం జడ్పిటిసి వెంకటేష్ మాట్లాడుతూ కష్టపడి చదివి కన్న తల్లిదండ్రులకు, మీరు పుట్టిన ఈ గడ్డకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని,మీ గమ్యం మీ చూపు, మీ ఆశయం,
ఆలోచన చదవాలనే కోరిక కసి పట్టుదలతో ఉంటే ఈ మానవ ప్రపంచంలో సాధించలేనిది ఏమీ లేదని చదివే అన్నిటికీ ముఖ్యమని చదువు లేనిది ఈ సమాజంలో మనం ఏమి సాధించలేమని తలకొండపల్లి జెడ్పిటిసి వెంకటేష్ భావోద్వేగంతో ప్రసంగించారు
ఈ కార్యక్రమంలో తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, తలకొండపల్లి సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్,శృతిలాయ కల్చరల్ అకాడమీ పౌండర్ దాస్ రావిచెడు మాజీ ఎంపీటీసీ రంగయ్య,డాక్టర్ శ్రీను,రవి,రామచంద్రయ్య,మహేష్,నరేష్ గౌడ్,సాయి, రమేష్,శేఖర్,తిరుపతి,కృష్ణ,కిరణ్,తదితరులు పాల్గొన్నారు