SAKSHITHA NEWS

Free camp under the auspices of Abhaya Hospital..

అభయ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్..


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్

శ్రీ అభయ హాస్పిటల్ ఆధ్వర్యంలో నగరంలోని పటేల్ స్టేడియంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ యం. ఎ. కరీం నేతృత్వంలో వైద్యులను అందుబాటులో ఉంచి మెడికల్ క్యాంపులు నిర్వహించారు.

క్యాంపులో డాక్టర్ ముజీబ్ అఫ్జల్ (ఎండ్రోక్రినాలజీ), డాక్టర్ ఫణితేజ విల్ల( కీళ్ళు, ఎముకలు), డాక్టర్. ఎస్.కే. మహబూబ్ బాషా (జనరల్ సర్జన్) వచ్చిన వారికి వైద్య సేవలు అందించారు. ఈ క్యాంప్‌లో సుమారు 500 మంది హాజరయ్యారు. ఈ క్యాంపులో ఉచిత మందులను కూడా అందించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ముజీబ్ అఫ్జల్ మాట్లాడుతూ.. ప్రతి వంద మందిలో 60 మందికి థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయని అని తెలిపారు. గతంలో థైరాయిడ్ వ్యాధి కోసం హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లి డాక్టర్లను సంప్రదించే వాళ్ళని ఇప్పుడు ఖమ్మంలో కూడా ఎండోక్రినాలజీ శ్రీ అభయ హాస్పిటల్ లో 24 గంటలు అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు.

థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల పర్యవేక్షణతో మందులు వాడాలన్నారు. పటేల్ స్టేడియంలో మెడికల్ క్యాంపు ఏర్పాటుకు కృషి చేసిన శ్రీ అభయ ఆసుపత్రి యాజమాన్యానికి వాకర్స్, ఇతర క్రీడాకారులు అభినందించారు.


SAKSHITHA NEWS