చంద్రయాన్ -3, ఆదిత్య -L1 ప్రయోగాల తర్వాత ఇస్రో శాస్త్ర వేత్తలు గగన్ యాన్ ను విజయవంతం చేయటం పై దృష్టి సారించారు.
2025 లో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ కోసం నలుగురు వ్యోమగాముల ఎంపిక కూడా పూర్తి అయ్యింది. ఈ ప్రయోగంలో బాగంగా ఈ నలుగురు వ్యోమ గాములను భూమికి 400 కిలో మీటర్లు ఎత్తులో ఉన్న కక్ష్య లోకి తీసుకువెళతారు.
వీరిని మూడు రోజులపాటు అక్కడే వుంచి తిరిగి భూమి మీదకు తీసుకువస్తారు. వారిని తిరిగి భూమి మీదకు తీసుకువచ్చే క్రమంలో భారత సముద్ర జలాల్లో ల్యాండ్ చేస్తారు.