గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల విలేజ్, శ్రీకృష్ణ కాలనీ, నవోదయ కాలనీ, రాజీవ్ నగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీలలో రూ.124.50 ఒక కోటి ఇరవై నాలుగు లక్షల యాబై వేల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ *
సాక్షిత : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల విలేజ్, శ్రీకృష్ణ కాలనీ, నవోదయ కాలనీ, రాజీవ్ నగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీలలో రూ.124.50 ఒక కోటి ఇరవై నాలుగు లక్షల యాబై వేల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ శ్రీ సాయి బాబా మరియు జలమండలి అధికారులు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మెరకు మరియు మా కార్పొరేటర్లు, మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ కి ఒక కిలో మిటర్ (1Km) మేర చొప్పున భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులు మంజూరి అయినవి అని దానిలో భాగంగా శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు,అత్యవసరం ఉన్న చోట , నిత్యం పొంగుతున్న ప్రాంతలలోప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. . ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ,కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు. ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, UGD వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, అదేవిధంగాసంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :
మంజూరైన అభివృధి పనుల వివరాలు…
1.నల్లగండ్ల విలేజ్ లో రూ. 22.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణ పనులు.
2.రాజీవ్ నగర్ లో రూ. 20.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణ పనులు.
3.శ్రీ కృష్ణ కాలనీ లో రూ. 20.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణ పనులు.
3.నవోదయ కాలనీ లో రూ. 30.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణ పనులు.
4.గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ కాలనీ లో రూ. 32.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణ పనులు.
పైన పేర్కొన్న UGD పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు మేనేజర్ అభిషేక్ రెడ్డి, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు,గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నం రాజు, జంగయ్య యాదవ్,మంత్రిప్రగడ సత్యనారాయణ, సురేందర్, ప్రసాద్,మల్లేష్, వినోద్, శంకరి రాజు ముదిరాజ్, నాగపూరి అశోక్,జగదీశ్, రమేష్ గౌడ్, సల్లావుద్దీన్,అక్బర్,నారాయణ,నర్సింహ రాజు,నవాజ్, శ్రీనివాస్,భిక్షపతి,ఫయాజ్,వెంకటేష్, హాసన్,ఖాదర్ ఖాన్,తాహీర్,అరుణ, రాణి, బాలమణి, మాధవి, లత,సుగుణ ,కార్యకర్తలు,వార్డు మెంబర్లు,ఏరియా,కమిటి మెంబర్లు,బూత్ కమిటి మెంబర్లు,కాలనీ వాసులు,కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.