దేవరకొండ సాక్షిత ప్రతినిధి
చందంపేట మండలం బొల్లారం గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, యంపీపి జాని యాదవ్, రైతు బంధు అధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య తో కలిసి మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ ప్రారంభించారు. ఆలయ పూజారి మోతీలాల్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించాడు. ఈ సందర్భంగా వడ్త్య దేవేందర్ నాయక్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన అమ్మ వారిని ప్రజలంతా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని కోరారు. అమ్మవారి కృపా కటాక్షములతో ఈ ప్రాంతంలో పంటలు బాగా పండాలని, పాడి పశు సంపద వృద్ధి చెందాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ప్రార్థించారు. ఆలయ అభివృద్ధికి భవిష్యత్తులో ఆసరగా ఉంటామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్. ఈ కార్యక్రమంలో లాల్ సింగ్, రమేష్, గ్రామ పెద్దలు, ప్రజలు, యువజన నాయకులు ఖాదర్ బాబా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.