— రాజ్యాంగం మీద బిజెపికి నమ్మకం లేదు – సీతారాములు
చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
అధికారం కోసమే బిజెపి పార్టీ రాజ్యాంగాన్ని వాడుకుంటుందని డా.బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పై బిజెపి కి నమ్మకం లేదని సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు ఎద్దేవా చేశారు.
చిట్యాల పట్టణంలోని మేకల లింగయ్య స్మారక భవనంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామనవమి శోభాయాత్రలో మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే పోస్టర్లను ప్రదర్శించారు ఈ దారుణమైన విషయాన్ని సిపిఐఎం పార్టీ ఖండిస్తుందని అన్నారు. రాజాసింగ్ పై కండిషన్ బెయిల్ ఉన్నప్పటికీ బరితెగించి ఇలాంటి దుస్సంఘటన కు కారణమైన రాజా సింగను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య గల దేశం ఈ దేశంలో రాజకీయాలు వేరు మతాలు వేరు అని అన్నారు. మతాన్ని, రాజకీయాలకు వాడుకోవద్దని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించిన తన తీరును మాత్రం మార్చుకుంటలేదని అన్నారు. బిజెపి పార్టీకి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నమ్మకం లేదని కేవలం అధికారం కోసం రాజ్యాంగాన్ని వాడుకుంటుందని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో బసవ కళ్యాణ్ బిజెపి ఎమ్మెల్యే రామున్ని విగ్రహం మీద పాదాలు మోపి దండ వేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు . ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే మతం, ఒకే దేశం ఒకే దేవుడు అనే విధంగా బిజెపి వ్యవహరిస్తుందని అన్నారు. ప్రపంచంలో మతం ఆధారంగా ఉన్న ఏ దేశం కూడా అభివృద్ధి చెందలేదని అన్నారు. అమెరికా లాంటి దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం కరెన్సీ, స్వదేశీ రక్షణ ,విదేశీ రక్షణ మాత్రమే చూస్తుందని, మిగతా శాఖలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయని అన్నారు. సిపిఐ ,సిపిఐ ఎం ,బిఆర్ఎస్ పార్టీలు కలిసి బిజెపి చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ ,కేటీఆర్ మీద కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సిబిఐ, ఈడీల చేత చేయించాలని గవర్నర్ గవర్నర్ ని కోరటం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కమిటీ సభ్యులు జట్ట నగేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాసులు, నాయకులు శీల రాజయ్య, లడే రాములు తదితరులు పాల్గొన్నారు.