SAKSHITHA NEWS

అయ్యప్ప స్వామి మహా పడిపూజలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపల్ పరిధిలో డి పోచంపల్లి గ్రామంలో సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అయ్యప్ప స్వాములు పాడిన భక్తి, భజన గీతాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఎం రాము గౌడ్ , డిపోచంపల్లి మాజీ సర్పంచ్, ఎక్స్ ఎంపీటీసీ శ్రీమతి రమా మాధవ రెడ్డి , నరేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సాయి యాదవ్, మహేందర్ ముదిరాజ్, లింగారెడ్డి మరియు అయ్యప్ప స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు


SAKSHITHA NEWS