SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 18 at 1.59.34 PM

కుత్బుల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..
సాక్షిత : కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలకు కోటి రూపాయలు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే వివేకానంద ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
..

కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ విలేజ్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మరియు ప్రాథమిక పాఠశాలను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆకస్మికంగా సందర్శించి, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు.
పాఠశాలలోని తరగతి గదులతో పాటు, మరుగుదొడ్లు, చిన్నపాటి వర్షానికే జలమయమైన పాఠశాల ఆవరణను పరిశీలించారు.
విద్యార్థులు సమస్యలు తెలుసుకోవడంతో పాటు..మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా తిని పరిశీలించారు.
పాఠశాలలోని మౌలిక సౌకర్యాలు, తరగతి గదులు లేకపోవడం, మధ్యాహ్న భోజనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు.
కూన శ్రీశైలం గౌడ్ మీడియా తో మాట్లాడుతూ..
కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల అత్యంత అద్వాన్నంగా ఉంది.
విద్యార్థులను ఇరుకు గదుల్లో కుక్కినట్టు కూర్చి పెట్టి, వంద మందికి ఒకే తరగతి గదిలో పాఠాలు చెప్తున్నారు.
టాయిలెట్లు సరిగా లేవని… ఆట స్థలం కూడా లేదని… సగం మందికి యూనిఫార్మ్ లు రాలేదని, మధ్యాహ్నం భోజనంలో నాణ్యత లేదని మండిపడ్డారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ 2014 లో గెలిచిన 100 రోజుల తర్వాత తన జీత భత్యాన్ని పేద విద్యార్థులకే కేటాయిస్తానని చెప్పాడు.. ఎనిమిదేళ్లలో ఎంత మంది విద్యార్థులకు ఖర్చు పెట్టాడో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే వివేక్ తన తండ్రి పేరిట సొంత డబ్బుతో కోటి రూపాయలతో ఈ పాఠశాలను అభివృద్ధి చేస్తానని చెప్పిన వీడియో ని చూపిస్తూ…. ఎమ్మెల్యే అబద్దపు హామీలను, దొంగ మాటలను ప్రజలకు వివరించారు
కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల కు ఎమ్మెల్యే వివేక్ చేసింది శూన్యం..
ఎమ్మెల్యే తన సొంత గ్రామంలోని స్కూల్ నే పట్టించుకోవడం లేదని… ఇక నియోజకవర్గాన్ని ఏం ఉద్దరిస్తాడని ఎద్దేవా చేసారు.
పాఠశాల లో సమస్యలు పరిష్కారం చేయకుంటే… కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు నటరాజ్ గౌడ్, నల్ల జయశంకర్ గౌడ్, నర్సింగరావు ఏటీఎం, శ్రీధర్ వర్మ, మురళీకృష్ణ, అలవేలు, అరుణ్, మనీష్, వీరబాబు, పులి సందీప్, ప్రవీణ్ చారి తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS