దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ .
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాత్రి గణేష్ నగర్,చింతల్, రంగారెడ్డి నగర్,కుత్బుల్లాపూర్ విలేజ్,రాజీవ్ గాంధీ నగర్,చిత్తారమ్మా టెంపుల్ తదితర ప్రాంతాల్లో ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారి మండపాలను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ సందర్శించి, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ని ఘనంగా సత్కరించారు. అమ్మవారి ఆశీస్సులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరిపై మెండుగా ఉండాలని, ప్రజలంతా సుఖ
సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, ఏ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ గౌడ్, దుర్గారావు చిత్తారమ్మ టెంపుల్ చైర్మన్ అంతయ్య గౌడ్ గారు యాదగిరి బాబు కూన జై కుమార్ గౌడ్ నరసింహారెడ్డి లింగం యాదవ్ వెంకటేష్ యాదవ్, మోతేశ్రీనివాస్, సాయికుమార్, బాలప్ప కూన రవీందర్ గౌడ్ కూన జగన్ గౌడ్ మణికంఠ, రఘు యాదవ్, భాస్కర్ రావు దుర్గాప్రసాద్, రాధాకృష్ణారెడ్డి జిమ్ వేణు బాలరాజు తదితరులు పాల్గొన్నారు