SAKSHITHA NEWS

రైతు భాంధవుడు,ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా బౌరంపేట్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరియు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రగతి నగర్ లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తీవ్ర కరువు కాటకాలతో అల్లాడుతున్న సమయంలో రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించి,కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత డా. వైఎస్ రాజశేఖర రెడ్డి కే దక్కుతుందని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద ప్రజల సంక్షేమం కొరకు పని చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయిన మహానేత డా. వై ఎస్ రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు. డా. వై ఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలందరూ కలిసికట్టుగా పని చేసి రాష్ట్రంలో మరియు కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కుత్బుల్లాపూర్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనోళ్ల లక్ష్మి,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు సదానందం,దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి,దుండిగల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి సాధు యాదవ్,దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేశ్,ఓ‌బి‌సి సెల్ అధ్యక్షులు కుమార్ యాదవ్,బి బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి దేవి,గిరిజన శక్తి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్నా లాల్ సింగ్ నాయక్,ఓ‌బి‌సి సెల్ రాష్ట్ర కో- ఆర్డినేటర్ గడ్డమీది భరత్ గౌడ్,ఏ‌ఐ‌సి‌సి హ్యూమన్ రైట్స్ యువజన అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ,127 డివిజన్ మైనారిటీ ప్రెసిడెంట్ జలీల్ ఖాన్,128 డివిజన్ మైనారిటీ ప్రెసిడెంట్ ఖాజా భాయ్,యువజన కాంగ్రెస్ నాయకులు బత్తుల చిరంజీవి,మాదిరెడ్డి అరుణ్ రెడ్డి,కొంటు సుమన్,మైనారిటీ నాయకులు మహమ్మద్ ఆరిఫ్,సయ్యద్ ఇబ్రహీం,మాజీ వార్డ్ సభ్యులు పరశురాం గౌడ్,ధర్మా రెడ్డి,చెవిటి శ్రీనివాస్,దుర్గా ప్రసాద్,లక్ష్మణ్,నరేశ్,రవి నాయక్,మిద్దెల సీతారాం రెడ్డి మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS