SAKSHITHA NEWS

వర్ధన్నపేట గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్: 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత

హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట గిరిజన బాలికల హస్టల్ లో పుడ్ పాయిజన్ తో 40 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది.
అస్వస్థతకు గురైన విద్యార్ధినులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.ఈ బాలికల హస్టల్ లో మొత్తం 190 మంది విద్యార్ధినులున్నారు. సోమవారం నాడు రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.రాత్రి భోజనం చేసే సమయంలో ఆహారంలో బల్లి అవశేషాలు కన్పించడంతో ఆందోళనకు గురై ఉంటారని వైద్యులు చెబుతున్నారు.అయితే విద్యార్ధినుల అస్వస్థతకు పుడ్ పాయిజన్ కారణమా లేదా అనే విషయాన్ని పరీక్షల తర్వాత చెబుతామని వైద్యులు ప్రకటించారు.ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న విద్యార్ధినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు.గతంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని గురుకుల పాఠశాలలు, హస్టల్స్ లో పుడ్ పాయిజన్లు చోటు చేసుకున్నాయి.ఆ ఏడాది జూలై 29వ తేదీన మహబూబాబాద్ గిరిజన బాలికల పాఠశాలలో పుడ్ పాయిజన్ జరిగింది.ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా అస్వస్థత పాలయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.జూలై 16న బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ తో ఓ విద్యార్ధి మరణించాడు.పలువురు విద్యార్ధులు అస్వస్థతకు గరయ్యారు.దీంతో మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని కూడా విద్యార్ధులు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది జూన్ 27న సిద్దిపేట జిల్లాలోని మైనారిటీ బాలికల స్కూల్ లో పుడ్ పాయిజన్ చోటు చేసుకుంది.ఈ ఘటనలో 128 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఏడాది మార్చి 13న ఆదిలాబాద్ భీంపూర్ కేజీబీవీలో 70 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు


SAKSHITHA NEWS