రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి — పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు – 2024 సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి రోడ్డు భద్రతా అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎస్పీ ,
Road safety – NGO, నరసరావుపేట కన్వీనర్ B.K. దుర్గ పద్మజ ఆధ్వర్యంలో జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు-2024.*
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం.
నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం, విశ్రాంతి లేకుండా ఎక్కువ దూరం వాహనం నడపడం, వ్యతిరేక దిశలో ప్రయాణించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించక పోవడం, అతివేగం, U- టర్న్ తీసుకునేటప్పుడు చుట్టూ వున్న వాహనాలను గమనించక పోవడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు.
విద్యార్ధి దశ నుండే రోడ్డు భద్రతా నియమాలపై తప్పక అవగాహన కలిగి ఉండాలి. అంతేకాకుండా వాటిపై వారి కుటుంబ సభ్యులకు మరియు చుట్టుప్రక్కల వారికి కూడా కల్పించాలి.
కుటుంబంలో ఏ వ్యక్తి అయినా ప్రమాదానికి గురైనా లేదా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతాయి కావున వాహనాలను నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలను పాటించాలి.
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద బాధితులకు తగిన దైర్యం చెప్పి, క్షతగాత్రులకు త్వరితగతిన వైద్యసహాయం అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి.
వాహనదారులు సీటు బెల్టు ధరించక పోవటం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఆటో సైడ్ సిట్టింగ్, డెఫెక్టీవ్ నంబర్ ప్లేట్స్, అనధికార పార్కింగ్ మొదలైన చట్టపరమైన ఉల్లంఘనలకు ఎవరూ పాల్పడకూడదని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు దిగువ పేర్కొన్న సూత్రాలు తప్పకుండా పాటించాలని తెలిపారు.
1) మద్యం సేవించి వాహనాలు నడుపరాదు.
2) వాహనాలు నడుపునప్పుడు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ మరియు ఇతర వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలి.
3) cell phone మాట్లడుతూ వాహనాలు నడుపరాదు.
4) అతివేగంతో వాహనాలు నడుపరాదు.
5)తప్పనిసరిగా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి.
6) జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా Line discipline పాటించాలి.
7)శ్రద్ధతో వాహనాలు నడపాలి.
8) వాహనాలు ఓవర్ టేక్(Over Take) చేసే సమయంలో తప్పనిసరిగా అద్దాలు(Mirrors) గమనించాలి.
9)రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సహాయం అందేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని, ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా యస్.పి.తో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) R రాఘవేంద్ర , ఏ ఆర్ అడిషనల్ యస్.పి Dరామచంద్ర రాజు, ఎస్బి సిఐ ప్రభాకర్ ఆర్ఐలు వెంకటరమణ , రవి కిరణ్ , రమణారెడ్డి , Road safety – NGO, నరసరావుపేట కన్వీనర్ B.K. దుర్గ పద్మజ , సభ్యులు బంగారయ్య , కోటేశ్వర రావు , సిబ్బంది పాల్గొన్నారు.