SAKSHITHA NEWS

పన్నుల వసూళ్లపై దృష్టి సారించండి.
సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించండి
*కమిషనర్ ఎన్.మౌర్య

*సాక్షిత * : నగరంలో పెండింగ్ లో ఉన్న ఆస్థి పన్నులు, నీటి పన్నులు వసూలు చేసి నగరపాలక సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కమిషనర్ ఎన్.మౌర్య రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్లు, తదితర అంశాలపై కచ్చపి ఆడిటోరియంలో అడ్మిన్ సెక్రటరీలు, ఆమెనిటి సెక్రటరీ లు, శానిటరీ సెక్రటరీలు, వెల్ఫేర్ సెక్రటరీలు, ఆయా విభాగాధిపతులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ఇంటి పన్నులు, నీటి చార్జీలు, భూగర్భ మురుగు చార్జీలు, ఖాళీ జాగా పన్ను బకాయిలు ఎక్కువగా ఉన్నాయని, వీటిని సకాలంలో వసూలు చేయాలని అన్నారు. రెవెన్యూ సిబ్బందితో పాటు, అడ్మిన్, అమెనిటి సెక్రటరీలు ఒక బృందంగా ఏర్పడి ఖచ్చితంగా పన్నులు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు.

మొండి బకాయిలు ఉన్న వారికి రెడ్ నోటీసులు ఇచ్చి వసూలు చేయాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుండి ఎక్కువ పెండింగ్ ఉన్నాయని చెప్పగా వారితో మాట్లాడి కొంత కొంత ఐనా వసూళ్లు చేయాలన్నారు. పన్నులను డిజిటల్ పద్ధతిలో చెల్లించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నామని అన్నారు. పన్నులు కాలంలో చెల్లించి నగర అభివృద్ధి సహకరించాలని ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి చేశారు. శానిటరీ సెక్రటరీ లు అన్ని దుకాణాల వద్దకు వెళ్లి పరిశీలించి సకాలంలో ట్రేడ్ లైసెన్సులు వసూలు చేయాలని అన్నారు. పి.ఎం.విశ్వ కర్మ యోజన పథకం లబ్ధిదారుల దరఖాస్తులు, సర్వేను పారదర్శకంగా పరిశీలన చేయాలని అన్నారు. నగరం మొత్తం రోడ్లలో గుంతలు పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా జరిగేలా చూడాలని అన్నారు. త్వరలోనే ప్రభుత్వ అదేనుసారం ఇంటింటి నిర్వహించాల్సి ఉందని, పారదర్శకంగా, జాగ్రత్తగా చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డెప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ వెంకట్రామిరెడ్డి, డి. ఈ.లు విజయకుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, నరేంద్ర, మహేష్, శ్రావణి, రాజు, రెవెన్యూ ఆఫీసర్స్ సేతుమాధవ్, కె.ఎల్.వర్మ, మేనేజర్ చిట్టిబాబు, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS