భూ సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టాలి:జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి IAS
తహసిల్దారులతో కలెక్టర్ సమావేశం..
గద్వాల జిల్లా
ధరణి, రెవెన్యూ , ఇనాం భూములకు సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టి పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి IAS తహసిల్దార్లకు ఆదేశించారు.
శనివారము ఐడిఓసి కాన్ఫరెన్సు హాలు నందు అన్ని మండలాల తహసిల్దర్లతో ఏర్పాటు చేసిన సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ.. దరణి, రెవెన్యూ ఇనాము భూములకు సంబంధించి పెండింగ్ ఉన్న సమస్యలపై అదనపు సిబంధిని ఏర్పాటు చేసి ప్రణాళిక ప్రకారం ఒక్కొక్క దరకాస్తు పై ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి పూర్తి చేయాలనీ అన్నారు.
డెత్ కేసులకు సంబంధించి కుటుంబ సబ్యుల దృవీకరణ పత్రం తప్పక ఉండాలన్నారు. భారత్ మాల క్రింద నష్టపోయిన రైతుల పరిహారం గురించి మాట్లాడారు. భారత్ మాల రహదారి నిర్మాణ కార్యక్రమంలో భాగంగా భూములకు సంబంధించిన పెండింగ్ ఉన్న వాటిని వారం లోపు పూర్తి చేయుటకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అన్ని మండలాల వారిగాసంబందిత తహసిల్దర్లతో వివరాలు అడిగి తెలుసుకున్నారు సర్వే నెంబర్ల ప్రకారం వెరిఫై చేసి త్వరలో పూర్తి చేయాలనీ తహసిల్దార్లకు ఆదేశించారు.