SAKSHITHA NEWS

శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు GHMC అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 4 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను పరిశీలించడం జరిగినది అని,పనులు త్వరితగతిన చేపట్టాలని, పనులలో వేగవంతం పెంచాలని,పనుల విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదని ,పనుల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎమ్మెల్యే గాంధీ అధికారులకు తెలియచేసారు. కల్వర్ట్ నిర్మాణము పై అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగినది. ఎన్నో ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరుగుతుంది అని , ఎంతో మంది ప్రయాణికులకు, వాహనదారులకు సాంత్వన చేకూరునని ఎమ్మెల్యే గాంధీ తెలియచేశారు.
అదేవిధంగా
వర్షం పడుతున్న ప్రతి సారి లింగంపల్లి అండర్ బ్రిడ్జి నీటితో నిండి పోవడం వలన పరిసర ప్రాంత ప్రజలకు, వాహన దారులకు ,ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని,ఈ సమస్యను పరిగణలోకి తీసుకుని శాశ్వత పరిష్కారం చేపట్టడానికి గాను ,శాశ్వత పరిష్కారం దిశగా అండర్ బ్రిడ్జి నుండి వరద నీటి కాల్వ మరియు బాక్స్ కల్వర్ట్ నిర్మాణం పనులు చేపడుతున్నామని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ముంపు సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
శేరిలింగంపల్లి లో అనేక రోడ్లు, లింక్ రోడ్లు, ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు నిర్మించి ప్రజలకు సుఖవంతమైన ట్రాఫిక్ రహిత సమాజాం కోసం కృషి చేశామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో GHMC SE శంకర్ నాయక్ ,EE KVS రాజు, DE దుర్గాప్రసాద్, AE సంతోష్ రెడ్డి, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందీప్ రెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

WhatsApp Image 2024 03 15 at 4.19.44 PM

SAKSHITHA NEWS