కోదాడ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మొదటి రోజు అన్నదాన కార్యక్రమం.
సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యపేట జిల్లా, :సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా దేవాలయంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అభిషేకం అనంతరం స్వామివారిని పల్లకి సేవలో ఊరేగించారు. దేవాలయ ప్రాంగణంలో ఉన్న శివాలయంలో 12 జ్యోతిర్లింగాలు కలవు. కార్తీక మాసం సందర్భంగా శివలింగానికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది.
మొదటిరోజు అన్నదాతలు ఇమ్మడి రమేష్ దంపతులు, సుంకర నాగేశ్వరరావు దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 650 మంది అయ్యప్ప స్వాములు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రేపాల ప్రసాద్ రావు, చల్లా రామ్మూర్తి, బొలిశెట్టి కృష్ణయ్య, దంతాల నాగయ్య, సురభి నరసయ్య, లక్ష్మీనారాయణ, సోమేశ్వరరావు,సుబ్బిశెట్టి స్వామి,ఓరుగంటి శ్రీను, గడియారం శ్రీను స్వామి, సత్యం స్వామి, రామనాథ స్వామి, సైదులు స్వామి, అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు