SAKSHITHA NEWS


Firenjan was sanctioned at the initiative of Minister Puvwada Ajay.

మంత్రి పువ్వాడ అజయ్‌ చొరవతో ఫైరింజన్‌ మంజూరు.

హర్షం వ్యక్తం చేసిన ఏఎంసీ చైర్‌పర్సన్‌, అధికారులు, రైతులు.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ ప్రాంగణంలోని ఫైర్‌ స్టేషన్‌కు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రత్యేక చొరవతో ఫైరింజన్‌తో పాటు సిబ్బందిని కేటాయించడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు ఖమ్మం ఏఎంసీ చైర్‌పర్సన్‌ దోరెపల్లి శ్వేత, ఏఎంసీ ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్షల మల్లేశం, సిబ్బందితో పాటు జిల్లా మార్కెటింగ్‌ అధికారి కే.నాగరాజు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ సందర్భంగా ఖమ్మం ఏఎంసీ చైర్‌పర్సన్‌ శ్వేత మాట్లాడుతూ మార్కెట్‌కు పత్తి, మిర్చి, తదితర పంటలు తీసుకువచ్చే రైతులకు అగ్నిప్రమాదాలనుండి తమ పంటలను కాపాడుకునేందుకు గాను మంత్రి అజయ్‌ ఫైరింజన్‌ తో పాటు సిబ్బందిని నియమించడం గొప్ప విషయమన్నారు.


ఖమ్మం మార్కెట్‌ ప్రాంగణంలో ఉన్న ఫైర్‌ స్టేషన్‌కు చాలా ఏండ్లుగా ఫైరింజన్‌తో పాటు సిబ్బంది లేక మార్కెట్‌కు పంటలు తీసుకొచ్చే రైతులు, అధికారులు, ప్రజలు ఏక్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉండేవారని, రైతుల కష్టాలు తెలిసిన మంత్రి అజయ్‌ ప్రత్యేకంగా చొరవ తీసుకుని మార్కెట్‌లో ఎలాంటి అగ్ని ప్రమాదాలకు తావులేకుండా ఉండేలా ఫైరింజన్‌ను తక్షణమే మంజూరు చేయడం అబినందనీయమని వారు అన్నారు.


SAKSHITHA NEWS