మాదాపూర్ లోని రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్:
హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డీ మార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణ కిచెన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కస్టమర్లు, వర్కర్లు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులకు రెస్టారెంట్ యాజమాన్యం సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సేఫ్టీ అధికారులు ఇంజన్ మంటలు ఆర్పుతున్నారు. ఫైర్ ఇంజిన్ సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు అధికారులు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
అయితే రెస్టారెంట్ లో ఉన్న ఫర్నీచర్ చాలా వరకు కాలిపోయిందని హోటల్ యాజమాన్యం తెలిపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.