సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
జిల్లాలోని హోంగార్డు ఆఫీసర్స్ కు ఆర్ధిక సహాయాన్ని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అందజేశారు.
అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోన హోంగార్డులకు మంజురైన ఐదువేల రూపాయల మెడికల్ బిల్లుల మొత్తాన్ని అదేవిధంగా హోంగార్డుల కుమార్తె వివాహానికి నిమిత్తం ఒక్కొక్కరికి మంజురైన 10 వేల రూపాయల మొత్తాన్ని పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ నగదు చెక్కులను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందుకున్న వారిలో హోంగార్డు ఆఫీసర్లు వై.జాన్, బి.శ్రీను, ఎం నాగేశ్వరరావు, డి అనూదీప్ వున్నారు. కార్యక్రమంలో అర్ ఐ సాంబశివరావు పాల్గొన్నారు.