SAKSHITHA NEWS

అంగరంగ వైభవంగా గ్రామ దేవత పండగలు

పల్లెల్లో గ్రామ దేవత ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ నేదురు పేట గ్రామంలో శ్రీశ్రీశ్రీ బంగారమ్మ తల్లి,అసిరితల్లి,అమ్మవారి పండగ ఆదివారం గ్రామాల భక్తులు నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గ్రామ దేవతలను పూజించే ఆచారం గ్రామ పల్లెల్లో ఆనాటి కాలం నుండి వస్తుందని,అమ్మవారికి నియమనిష్టలతో మూర్రటలు తిరువీధి ఊరేగింపు అలాగే కోళ్లను,పొట్టేళ్లను బలి అర్పించి పూజిస్తే అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని తెలిపారు.అందులో భాగంగానే అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు.గ్రామానికి చెందిన వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి తమ మొక్కులు చెల్లించుకున్నారు..ఈ పండుగలో టిడిపి కంటెస్టెంగ్ సర్పంచ్ బాసి గోవింద రెడ్డి,మాజీ ఎంపిటిసి సభ్యులు,బోర పార్వతి రెడ్డి,గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS