పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుంది కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎమ్మెల్యేలు.
నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్ బెదురూమ్ ఇండ్లు – ఎమ్మెల్యే కె.పి.వివేకానంద.
ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదురుపల్లి లో డబుల్ బెడ్ రూమ ఇళ్ల పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ , ఎమ్మెల్యే కె పి వివేకానంద్ , కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు, తో కలిసి ఇళ్లను పంపిణి చేసారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. సకల సౌకర్యాలతో వాటిని నిర్మించి.. దశలవారీగా అర్హులైన పేదలకు లాటరీ ద్వారా ఎంపిక చేసి పంపిణీ చేస్తున్నది.
గ్రేటర్లో ఒకేరోజు 11, 700 గృహాలను 24 నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందజేసింది. ఇందులోభాగంగానే ఒక్కో నియోజకవర్గం నుంచి 500 మంది లబ్ధిదారులను బహదూర్‌పల్లిలో 1700 లబ్ధిదారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఇండ్ల పంపిణీ చేసారు.
నిరుపేదల సొంతింటి సాకారం సాధ్యమా అని విమర్శించినా ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యమంత్రి కేసిఆర్ పేదవారి సొంతింటి కల సాకారం చేస్తూ వారి విమర్శలను తిప్పి కొట్టారు. నిరుపేదలు ఆత్మ గౌరవంతో బతకడంతో పాటు మహా నగరంలో ఖరీదైన సొంతింటి కలను నెరవేర్చుకునే అదృష్టాన్ని కల్పించిందని. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే డబుల్ బెడ్ రూమ ఇళ్ల పంపిణి విషయంలో తప్పుడు ప్రచారాలను, దళారుల నమ్మరాదని. లబ్దిదారులను ర్యాండమైజెషన్ సాఫ్ట్ వేర్ ద్వారా లక్కీ డ్రా తీసి వారికి ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయించనుందిఅని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ డి.అమోయ్ కుమార్ , GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ , కార్పొరేటర్ జి.లాస్య నందితా, బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.