రంజాన్ ఉపవాస ప్రాశస్త్యం.
ఖమ్మం బ్యూరో మదర్ సాహెబ్ షేక్ (జర్నలిస్ట్)
రోజా (ఉపవాసాలు)ను అరబీలో ‘సౌమ్’ అంటారు. సౌమ్ అంటే ఆగిపోవడం, కట్టుబడి ఉండటం అని అర్థం. ధార్మిక పరిభాషలో ఆరాధనా సంకల్పంతో సూర్యోదయానికి ముందు నుండి సూర్యాస్తమయం వరకు తినడం, త్రాగడం, ఉపవాసానికి భంగం కలిగించే అన్ని కార్యాలకు దూరంగా ఉండటాన్ని ‘సౌమ్’ అంటారు. ఉపవాసం కేవలం దైవప్రసనృత కొరకు మాత్రమే పాటించబడుతుంది. ఉపవాసం వల్ల మనిషిలో భయభక్తులు జనిస్తాయి.
విశ్వసించిన ఓ ప్రజలారా! ఉపవాసాలుండడం మీపై విధిగా నిర్ణయించబడింది. మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విద్దగా విదించబడింది. తద్వారా మీలో భయభక్తులు పెంపొందించే అవకాశం ఉంది. (2:183)
ఉపవాసం వల్ల మనిషిలో భయభక్తులే కాదు ఉత్తమమైన సుగుణాలు పెంపొందుబడుతాయి. కష్టాలను తట్టుకునే మనోనిబ్బరం ఆకలి దప్పిక లను తట్టుకునే సహనం కోరికల పట్ల నిగ్రహం మనోవాంచలకు కళ్లెం వేసే శక్తి అలవడుతాయి. రంజాన్ మాసం నెలవంక కనిపించినప్పటి నుంచి ఉపవాసాలు ప్రారంభం అవుతాయి తదుపరి నెలవంక కనిపించేటప్పటికి ముగుస్తాయి. అదే లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే అయితే మీలో వ్యాధిగ్రస్తులుగానో, ప్రయాణీకులుగానో ఉన్నవారు ఆ ఉపవాసాల లెక్క ఇతర దినాలలో పూర్తి చేయాలి. స్థోమత ఉన్నవారు పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. కానీ ఎవరైనైనా స్వచ్చందంగా ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తూ, అది వారికి మేలు మీరు గ్రహించగలిగితే ఉపవాసం ఉండటమే మీ కొరకు శ్రేయస్కరం ” (2:154)
ఉపవాస దీక్ష సహరితో మొదలై ఇఫ్తార్ తో ముగుస్తుంది. రంజాన్ నెలలో వేకువ జామున లేచి సహరి భుజిస్తారు. సహరి గురించి దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు. ‘ప్రజలారా సహరీ భుజించడం శభకరం. ఈ శుభం అల్లాహ యే మీకు ప్రసాదించాడు. అందువల్ల సహరి భూజచడం మానివేయకండి ” అయితే సహరి మరి అర్ధరాత్రి చేయరాదు సహరీ చేయడంలో ఆలస్యం చేయాలి.,
హాజరత్ జైద్ బిన్ సాబిత్ (ర) చెప్పిన దాని ప్రకారం దైవప్రవక్త (స) సహరీకి మరియు ఫజర్ నమాజ్ కు మధ్య యాభై దివ్య ఖుర్ఆన్ ఆయత్ లు పఠించెంత వ్యవధి ఉండేది.
సూర్యుడు అస్తమించిన తర్వాత ఉపవాసం విరమించడాన్ని ఇఫ్తార్ అని అంటారు. ఇఫ్తార్ లో తొందర చెయ్యడం దైవ ప్రవక్త(స) సాంప్రదాయం. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు. ప్రజలు ఇస్తార్ చెయ్యడంలో ఎప్పటికైతే తొందర పడుతారా ఈ ధర్మం అప్పటి వరకు ఉన్నత స్థాయి ప్రాబల్యం స్థితిలో ఉంటుంది..
రంజాన్ మాసం మహత్తరమైన శుభాలు కలిగిన మాసం. ఇంకా రంజాన్ మాసంలోనే ఖుర్ఆన్ గ్రంథం అవతరించడం జరిగింది.
రంజాన్ నెల ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల ఖుర్ఆన్ గ్రంథం మానవులందరికీ మార్గదర్శకం.” (2: 185)
రంజాన్ నెల యొక్క శుభాలను గురించి ఒక హదీసులో ఇలా సల్మాన్ ఫార్సీ(ర) ఉల్లేఖనం ప్రకాశం: ప్రియ ప్రవక్త (స) షాబాన్ నెల చివరి తేదిన ఈ విధంగా ప్రసంగించారు.
ఓ జనులారా ! ఓ మహోజ్వలమైన ఎనలేని శుభాలగల నెల త్వరలో రామన్నది. ఆ నెలలో ఒక రేయి వేయి నెలలకంటే శుభ ప్రదమైనది. అల్లాహ్ ఈ నెలలో ఉపవాసం విధిగా నిర్ణయించాడు. ఈ నెలలో రాత్రుల్లో తరావీహే నమాజ్ చేయడాన్ని నఫిల్ గా ఖరారు చేశాడు. ఈ నెలలో ఎవరైన సత్కార్యాన్ని చేస్తే అది ఇతర మాసాల్లో ఒక విధిని నిర్వర్తించడానికి సమానం. ఎవరైతే ఒక ఫర్జ్ ను నిర్వర్తిస్తే అది ఇతర నెలల్లో 70 విధుల్ని నిర్వర్తించడానికి సమానం. ఇది సహనం వహించవలసిన నెల. సహనానికి ప్రతిఫలం స్వర్గం.
ఇంకా ఒక హదీసు ఖుదుసిలో ఉపవాసం ప్రాముఖ్యం ఇలా తెలుపబడింది.
అల్లాహ ఇలా సెలవిచ్చాడు.. ఆదం పుత్రునికి ప్రతి సత్కార్యానికి ప్రతఫలం ఎన్నో రెట్లు నిర్ణయించుడుతుంది. ఒక ప్రతఫలం పదిరెట్లు నుంచి మందరెట్ల వరకు పెంచబడుతుంది. దాసుడు కేవలం నా అభిష్టం. మేరక ఉపవాసం ఉంటాడు. మనోవాంచలను త్వజిస్తాడు. అందువల్ల స్వయంగా నేనే తన ప్రతఫలం ప్రసాదిస్తాను.” (ముస్లిం)
ఇంకా రంజాన్ మాసంలో ఒక ఘనమైన రాత్రి ఉంది. ఆఘనమైన రాత్రిని ‘ లైలతుల్ ఖద్ర్” అని అంటారు. ఈ రాత్రిపూట ఈ ఏడాది కాలానికి సంబందించిన వ్యవహారాలన్ని సమీక్షించి నిర్ణయించబడతాయి. అందుకే ఖద్ర్ రేయి ని మహత్పూర్వకమైన రేయిగా, ఉత్తర్వులను జారీచేసే రేయిగా అభివర్ణిస్తారు. ఈ రాత్రియందు దివి నుంచి దిగి వచ్చిన దైవమాతలలో భూమి అంతా కిక్కిలిసిపోతుంది అందుకే ఈ రేయికి ఇరుకైన రేయి అని కూడా పేరు ఉంది. ఈ రాత్రయందు చేసే దైవఆరాధన ఎంతో మహత్పూర్వకమైనది, ఎంతో పుణ్య ప్రదమైనది. ఈ రేయి రంజాన్ మాసంలోని చివరి పది రాత్రులలో ఏది అనే విషయంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే హదీసులను, చారిత్రక ఉల్లేఖనాలను బట్టి ఇది రంజాన్ నెలలో చివరి దశకంలోని బేసి రాత్రుల్లో ఏదో ఒక రేయి నెలకొంటుందని తెలుస్తుంది . ఈ రాత్రి యందు చేసే దైవారాధన వెయ్యిమాసాలలో చేసే ఆరాధన కంటే గొప్పది వెయ్యిమాసాలు అంటే 83 సంవత్సరాల 4 నెలన్నమాట. అతి తక్కువ సమయంలో అత్యంత అధికంగా పుణ్యం సంపాదించుకునే అవకాశం అల్లాహ ముహమ్మద్ ప్రవక్త (స) అనుచర సమాజంపై చేసిన మహోపకారం. ఖద్ర్ రాత్రియందు ఈ దువా చేయాలనే దైవప్రవక్త(స) గట్టిగా నొక్కి చెప్పారు. అల్లాహుమ్మ ఇన్నక అపువ్వున్ తుహిబ్బల్ అప్వ ఫాపు అన్ని ” (తిర్మిజీ, ఇబ్ను మాజా)
ఇంకా పవిత్రమాసం చివరి దశకంలోనే దైవ ప్రవక్త (స) మసీదులో ఏతెకాఫ్ పూనేవారు. అలాగే సాధ్యమైనంత ఎక్కువగా ధాన ధర్మాలు చేసేవారు. తమ ఇంటిల్లిపాదికి ధాన ధర్మాలు లు చేయండని ప్రోత్సహించేవారు.
రంజాన్ పవిత్రమాసంలో నే ఫిత్రా దానం చెల్లించ బడమంది. ఉపవాస దీక్ష సమయంలో మనకు తెలియకుండా ఏమైనా చిన్నచిన్న పొరపాట్లు జరిగితే, అలాంటి పొరపాట్లు ప్రక్షాళన ఈ ఫిత్రాదానం ద్వారా జరుగుతుంది. అని దైవప్రవక్త(స) సెలవిచ్చారు. మనమంతా రంజాన్ మాసం యొక్క ప్రాశస్త్యం తెలుసుకుని సాధ్యమైనంత ఎక్కువ ఆరాధనలు చేయాలి. అల్లాహ తాలా మనందరికీ రంజాన్ మాసంను పొందే రంజాన్ మాసం యందలి శుభాలను పొందే సాభాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్