రైతు సహకార సంఘం వ్యాపార కేంద్రంగా మార్చారు
సహకార సంఘం డైరెక్టర్ చేసిన అవినీతి ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలని అమలు చేయడంలో విఫలమయ్యారు
సమస్యలపై ప్రశ్నిస్తున్న గొంతుకులను నొక్కిస్తున్నారు
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో 47వ వార్షిక నివేదిక కార్యక్రమంలో రైతులు సమస్యలను అడుగుతున్న గొంతు నొక్కేస్తున్నారని రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సహకార సంఘంలో 14 మంది ఉద్యోగం చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేయడంలో విఫలమయింది రైతు దిగుబడి పంటల కోసం ఏటువంటి సలహాలు సూచనలు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు
రైతుల సొమ్మును సిబ్బంది జీతాల పేరిట మీద నిమిత్త ఖర్చుల పేరిట అత్యధికంగా ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ ఆధ్వర్యంలో రైతుల కోసం బర్లు మరియు గొర్ల కోసం 50 లక్షల లోన్ 50% సబ్సిడీతో ఇస్తున్నారు గోదాములు కోల్డ్ స్టోరేజ్ లకు ఐదు కోట్ల వరకు సబ్సిడీతో రుణాలు ఇస్తున్నారు దీన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు
ఒక ఎకరానికి 20 వేలు వరకు రైతులకు ఎరువుల సబ్సిడీ ఇస్తున్నాయి 50% సబ్సిడీ ట్రాక్టర్ కూడా ఇస్తున్నారు
ఇవన్నీ వినియోగించుకోవాలని రైతులను కోరారు