SAKSHITHA NEWS

రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కల్పించాలి.

దళారి వ్యవస్థ పై గట్టి నిఘా.

వసతులు సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం.

జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ .

రైతులు నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. చివ్వేంల మండలం కుడకుడ లో మెప్మా ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం అలాగే ఆత్మకూరు ఎస్, నెమ్మికల్ కందగట్ల లలో PACS ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు దళారుల నుండి మోస పోకుండా అలాగే ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో గట్టి నిఘా ఉంచాలని రైతులు నేరుగా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని అన్నారు. PACS ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాలలో టెంట్, త్రాగు నీరు వసతి లేకపోవడం తో నిర్వాహకులు, సిబ్బంది పై అగ్రహం వ్యక్తం చేసారు. రైతులు తెచ్చే ధాన్యం లో తేమ శాతం 17 మించకుండ ఉండాలని అలాగే ధాన్యం శుద్ధి చేసే యంత్రం ద్వారా శుభ్రపర్చలన్నారు. అన్ని కేంద్రాలలో గన్ని సంచులు, తేమశాతం మిషన్లు, ధాన్యం శుద్ధి చేసే యంత్రాలు,టార్పాలిన్లు,కూలీలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

కేంద్రాల్లో రైతులు ఎక్కడ కూడ ఇబ్బంది పడకుండా అన్ని మౌళిక వసతులు కల్పించాలన్నారు.కొనుగోలు చేసిన ధాన్యాని నిలువ ఉంచకుండా వెంటనే ట్యాగింగ్ చేసిన ఆయా మిల్లులకు వెంటనే తరలించాలన్నారు.వ్యవసాయ శాఖ అధికారులతో పాటు అనుబంధ శాఖ అధికారులు నిరంతరం రైతులకు అందుబాటులో ఉండి నాణ్యమైన ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా రైతులలో అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్ లు కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఈ సందర్బంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్ కుమార్, పి.ఏ.సి.ఎస్ సిబ్బంది, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 04 02 at 6.01.12 PM

SAKSHITHA NEWS