SAKSHITHA NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు

ఐకెపిలో వడ్లుపోసి నెలలు గడుస్తున్న కాంటాకు నోచుకొని పోలమల్ల ఐకెపి కేంద్రం

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నెలల తరబడి రైతులు పడిగాపులు కాసే పరిస్థితి నెలకొన్నది.సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలలో పెద్ద పెద్ద కుప్పలతో ధాన్యం దర్శనమిస్తోంది. ముఖ్యంగా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో హైవే రోడ్డు పక్కన ఉన్న ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. ఇదే గ్రామానికి సంబంధించి ఒకే సంఘానికి చెందిన రెండు వేరువేరు ప్రాంతాలలో ధాన్యం రాశులుగా పోసుకున్నారు.

ఒక చోట ధాన్యాలు కాంటా వేసి మరో ప్రాంతానికి సంబంధించిన కాంటాలను నిలిపివేయడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ పరిస్థితి వర్షం కురిసే విధంగా ఉన్న నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజులు ఈ కేంద్రాలలో పడిగా పులుకాయాలో అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోని ధాన్యం కాంటాలు వేయించాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఒకే సంఘం ఒకే గ్రామానికి చెందిన వేరువేరు స్థలాలలో పోసిన ధాన్యాలను తేమ శాతం చూడాలంటే తమకు ఇబ్బందిగా ఉంటుందని ఏవో, ఏఈఓలు భావించి ఈ కేంద్రానికి సంబంధించిన ధాన్యాన్ని తేమ శాతం చూడట్లేదని తెలుస్తోంది. ఉన్నత స్థాయి అధికారులు పట్టించుకోని పోలుమల్ల గ్రామ రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.


SAKSHITHA NEWS